మంత్ర ముగ్ధుల్ని చేసే ఐదు శివలింగాల దర్శనం అద్భుతం.. అవి ఎక్కడ ఉన్నాయో తెలుసా?

మనదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉన్నాయి.ఈ శివాలయాలలో ఎక్కువ భాగం మనకు శివడు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు.

ఈ విధంగా వెలసిన శివలింగానికి ఒక్కో లింగానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.అయితే మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన మనల్ని మంత్రముగ్ధుల్ని చేసే ఐదు శివలింగాలు ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు.

మరి ఆ అయిదు శివలింగాలు ఏవి? వాటి విశిష్టత ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

H3 Class=subheader-styleఅమర్ నాథ్ దేవాలయం:/h3p మన దేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో అమర్ నాథ్ ఆలయం ఒకటి.

ఈ ఆలయంలో సంవత్సరంలో ఒక నిర్దిష్టమైన సమయంలో మాత్రమే శివలింగం మనకు దర్శనమిస్తుంది.

ఈ ఆలయం వేసవికాలంలో తప్ప మిగతా సమయాలలో మంచుతో కప్పబడి ఉంటుంది.అందుకోసమే ఈ ఆలయాన్ని దర్శించడం కోసం వేసవిలో ఎక్కువ మంది యాత్రికులు ఇక్కడికి తరలి వస్తారు.

ఇక్కడ శివలింగం స్వయంగా మంచుగడ్డతో సృష్టించబడ్డ శివలింగమై అత్యంత ప్రసిద్ధిగాంచినది.h3 Class=subheader-styleనర్మదా నదీ తీరం వద్ద ఉన్న శివలింగం:/h3p """/" / మధ్యప్రదేశ్ లో వున్న మహేశ్వర్ లో నర్మదా నదిలో ప్రతిష్టించబడివున్న ఈ శివలింగం అత్యంత అద్భుతమైనది.

ఈ శివలింగం ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు.పురుషుడు మరియు ప్రకృతి సమాగమనాన్ని సూచించే ఈ శివలింగం అత్యంత పవిత్రమైనది.

నర్మదా నదిలో స్నానమాచరించి ఇక్కడ వెలసిన శివ లింగాన్ని దర్శించడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.

H3 Class=subheader-styleబృహదీశ్వరాలయం:/h3p """/" / తమిళనాడులో ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో బృహదీశ్వర ఆలయం ఒకటి.

ఈ ఆలయంలో పరమశివుడు ఏకశిలతో నిర్మితమై ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత అని చెప్పవచ్చు.

H3 Class=subheader-styleకేదారేశ్వర దేవాలయం:/h3p """/" / మహారాష్ట్రలోని హరిశ్చంద్రఘడ్ లో వున్న కేదారేశ్వర దేవాలయంలో అత్యంత మహిమాన్వితమైన దేవాలయం.

ఈ ఆలయం నీటిలో శివలింగం కొలువై ఉండి ఈ ఆలయం నాలుగు స్తంభాలతో నిర్మితమై ఉంది.

ఈ నాలుగు స్తంభాలను నాలుగు యుగాలుగా భావించారు.ఇప్పటికే మూడు స్తంభాలు విరిగిపోయినప్పటికి కేవలం ఒక స్థంభంపై మాత్రమే ఆలయం ఆధారపడి ఉంది.

ఈ స్తంభం కూడా విరిగిపోతే యుగాంతం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు.h3 Class=subheader-styleముఖలింగం:/h3p """/" / మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషాలోని ఉదయగిరి గుహలో అత్యంత అరుదైన శివలింగం ఉంది.

ఈ శివలింగం ఒక ఆకారాన్ని కలిగి ఉండటం వల్ల దీనిని ముఖలింగం అని పిలుస్తారు.

ఈ విధంగా మనదేశంలో ఎన్నో శివాలయాలు ఉండగా ఈ శివలింగాలు ఎంతో ప్రత్యేకమని చెప్పవచ్చు.

“పాకిస్థాన్‌లోనైతే నిన్ను కిడ్నాప్ చేసేవాణ్ణి”.. ప్యాసింజర్‌కు ఉబర్ డ్రైవర్ టెర్రర్ పుట్టించాడు!