బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఐదుగురు నిర్వాహకులు అరెస్ట్

బెంగళూరు రేవ్ పార్టీ( Bangalore Rave Party ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఐదుగురు నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు.హైదరాబాద్ కు చెందిన వాసు( Vasu ) అనే వ్యాపారి పుట్టినరోజు సందర్భంగా పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

సన్ సెట్ టూ సన్ రైజ్ విక్టర్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ పార్టీలో పలువురు డ్రగ్స్ పెడ్లర్లు పాల్గొన్నారు.

రేవ్ పార్టీకి( Rave Party ) మొత్తం 150 మంది హాజరయ్యారని పోలీసులు తెలిపారు.

వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు ఉన్నారని చెబుతున్నారు.పార్టీకి హాజరైన వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించిన పోలీసులు డ్రగ్స్( Drugs ) తీసుకున్నట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని వెల్లడించారు.

అదేవిధంగా పార్టీకి హాజరైన వారికి సంబంధించిన 18 లగ్జరీ కార్లతో పాటు 45 గ్రాముల ఎండీఎంఏ, కొకైన్ ను పోలీసులు సీజ్ చేశారు.

అతడితో నా అనుబంధానికి పేరు పెట్టలేను.. సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్!