టీఎస్‌పీఎస్సీ లో ఐదుగురు సభ్యులు రాజీనామా..!!

నిన్న టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడం తెలిసిందే.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన అనంతరం జనార్దన్ రెడ్డి.

తన పదవికి రాజీనామా చేయడం జరిగింది.అయితే ఇప్పుడు మరో అయిదుగురు రాజీనామా చేశారు.

రాజీనామా చేసిన సభ్యుల వివరాలు చూస్తే సత్యనారాయణ, బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, సుమిత్ర ఆనంద్, కారెం రవీంద్రారెడ్డి ఉన్నారు.

ఇదిలా ఉంటే నేడు టీఎస్‌పీఎస్సీ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం జరిగింది.

గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజ్ ఘటన తెలంగాణ రాజకీయాలను కుదిపేసింది.ఈ ఘటనతో నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అసలే ప్రభుత్వం నోటిఫికేషన్లు( Notifications ) విడుదల చేయడం లేదని.ఆగ్రహం మీద ఉన్న నిరుద్యోగులు ఈ ఘటనతో పోటీ పరీక్షలు వాయిదా పడటంతో.

తీవ్ర గందరగోళానికి గురయ్యారు.ఈ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ బోర్డుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం జరిగింది.

అంతేకాదు పేపర్ లీక్( Paper Leak ) ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో చాలామంది అరెస్ట్ అయ్యారు.

ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )ఈ ఘటనకు సంబంధించి చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు.

దీనిలో భాగంగా చైర్మన్ జనార్దన్ రెడ్డి నిన్న రాజీనామా చేయటం నేడు అయిదుగురు సభ్యులు రాజీనామా చేయటం సంచలనం సృష్టించింది.

ఈటెల రాజేందర్ కు ఆ పదవి ఫిక్స్ కాబోతోందా ?