నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి అక్కడికక్కడే ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై తెల్లవారుజామున ప్రమాదం సంభవించింది.

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం ధైర్యపురి తండా మలుపు వద్ద ఓ కారు అదుపు తప్పింది.

వేగంగా వస్తున్న కారు రోడ్డుకు మలుపు ఉండటంతో కారు అదుపు తప్పింది.సినిమాల్లో జరిగేలా కొంతదూరం వరకు పల్టీలు కొట్టుకుంటు వెళ్లింది.

అది చూసిన స్థానికులు కారు దగ్గరికి పరిగెత్తారు.కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులకు అక్కడికక్కడే మరణించారు.

దీంతో స్థానికులు పోలీసులు సమాచారం అందించారు.పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు.

కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

అయితే ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని, రోడ్డు మలుపు వల్ల ప్రమాదం సంభవించి ఉంటుందని భావిస్తున్నారు.

కేసు విచారణలో ఉందని పోలీసులు వెల్లడించారు.