పిచ్చికుక్క దాడిలో ఐదు గేద దూడలు, వ్యక్తికి గాయాలు.
TeluguStop.com
ఎల్లారెడ్డిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కేశవ పెరుమాండ్ల దేవాలయం వద్ద ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రాలలో కట్టి వేయబడిన గేదె దూడల పై పిచ్చికుక్క దాడి చేయగా ఈ దాడిలో 5 దూడలు గాయపడ్డాయి.
అలాగే రోడ్డు వెంబడి నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిని కూడా గాయపరిచిన పిచ్చి కుక్క.
వెంటనే అక్కడ ఉన్న స్థానికులు గమనించి ఆ కుక్కను చంపివేయడం జరిగింది.గ్రామాలలో విపరీతంగా పెరుగుతున్న వీధి కుక్కలు భయాందోళనలో గ్రామస్తులు.
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ఆ వీధి కుక్కల బెడదను తగ్గించాలని ఆయా గ్రామాల ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
అల్లు అర్జున్ కేసు నుంచి బయట పడతాడా..?