ఈ 5 సూత్రాలు పాటిస్తే వేస‌విలోనూ అందంగా మెరిసిపోవ‌చ్చు!

వేస‌వి కాలం స్టార్ట్ అయిందంటే చాలు ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌లు, వాటితో పాటే మ‌రెన్నో చ‌ర్మ స‌మ‌స్య‌లు తీవ్రంగా క‌ల‌వ‌ర పెడుతూ ఉంటాయి.

ముఖ్యంగా స‌న్ ట్యాన్‌, ఆయిలీ స్కిన్‌, స్కిన్ టోన్ త‌గ్గిపోవ‌డం, డార్క్ స‌ర్కిల్స్ ఇలా ర‌క‌ ర‌కాల స‌మ‌స్య‌లు నానా ఇబ్బందుల‌కు గురి చేస్తుంటాయి.

దాంతో వాటిని నివారించు కోవ‌డం కోసం ముప్ప తిప్ప‌లు ప‌డుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఐదు సూత్రాల‌ను పాటిస్తే గ‌నుక వేస‌వి లోనూ అందంగా మెరిసిపోవ‌చ్చు.

మ‌రి ఆ ఐదు సూత్రాలు ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.వాట‌ర్‌.

ఆరోగ్యాన్నే కాదు చ‌ర్మ సౌంద‌ర్యాన్ని ర‌క్షించ‌డంలోనూ కీల‌క పాత్ర పోషిస్తుంది.రోజుకు ఎనిమిది గ్లాసుల వాట‌ర్‌ను తాగ‌డం వ‌ల్ల స‌మ్మ‌ర్‌లో మీ చ‌ర్మ ఆరోగ్యం దెబ్బ తిన‌కుండా ఉంటుంది.

అదే స‌మ‌యంలో శ‌రీరం డీహైడ్రేట్ అవ్వ‌కుండా కూడా ఉంటుంది.అలాగే ఉద‌యం, సాయంత్రం స్నానం చేసిన‌ప్ప‌టికీ చ‌ర్మంపై కొన్ని కొన్ని డెడ్ స్కిన్ సెల్స్ మిగిలే ఉంటాయి.

అందువ‌ల్ల రాగి పిండిలో పాల‌ను క‌లిపి చ‌ర్మానికి ప‌ట్టించి స్క్ర‌బ్బింగ్ చేసుకోవాలి.ఆపై సోప్‌ను యూజ్ చేయ‌కుండా గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేసేయాలి.

వారంలో రెండు సార్లు ఈ చిట్కాను పాటిస్తే డెడ్ స్కిన్ సెల్స్ తొల‌గిపోతాయి.

స్కిన్ టోన్ పెరుగుతుంది. """/" / స‌మ్మ‌ర్‌లో వీలైనంత వ‌ర‌కు టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్ ను ఎవైడ్ చేయాలి.

వాటి బ‌దులు కొబ్బ‌రి నీళ్లు, ఫ్రూట్ జ్యూసులు, మ‌జ్జిగ‌, స‌బ్జా వాట‌ర్‌, లెమ‌న్ జ్యూస్ వంటి వాటిని తీసుకోవాలి.

మ‌రియు డైట్‌లో ఎప్పుడూ లైట్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.త‌ద్వారా చ‌ర్మం ఆరోగ్య‌ వంతంగా మెరుస్తుంది.

స‌మ్మ‌ర్‌లో బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు త‌ప్ప‌ని స‌రిగా నాణ్య‌మైన స‌న్‌ స్క్రీన్‌ను రాసుకోవాలి.ఇది ఎండ‌ల వ‌ల్ల మ‌న చ‌ర్మం దెబ్బ తిన‌కుండా అడ్డు క‌ట్ట వేస్తుంది.

ఇక చివ‌ర‌గా ప్ర‌తి రోజు వ్యాయామాలు చేయాలి.చాలా మంది స‌మ్మ‌ర్‌లో వ్యాయామాల‌ను నిర్ల‌క్ష్యం చేస్తుంటారు.

కానీ, వ్యాయామాలు చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యంతో పాటు చ‌ర్మ సౌంద‌ర్య కూడా పెరుగుతుంది.

ఎన్టీఆర్, విశ్వనాథ్ మధ్య గొడవ ఏంటి ? 20 ఏళ్లు ఎందుకు మాట్లాడుకోలేదు ?