ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ టెస్ట్ తప్పనిసరి:ఆర్టీవో జిలాని
TeluguStop.com
సూర్యాపేట జిల్లా( Suryapet District ):స్కూల్ బస్సు ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని కోదాడ ఆర్టీవో జిలాని హెచ్చరించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలోని మొత్తం 189 ప్రైవేట్ బస్సులు ఉన్నాయని,150కి పైగా ఇప్పటికే తనిఖీలు నిర్వహించామని,ఇంకా తనిఖీలు కొనసాగుతాయన్నారు.
ప్రతీ ఒక్క స్కూల్ బస్సుకు ఫిట్నెస్ టెస్ట్( School Bus Fitness Test ) తప్పనిసరి చేయించుకోవాలన్నారు.
ఫిట్నెస్ టెస్ట్ చేపట్టని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మూడేళ్లు మొబైల్ కు దూరంగా ఉంటూ ఐఏఎస్.. నేహా బైద్వాల్ సక్సెస్ కు వావ్ అనాల్సిందే!