మామూళ్ల పంచాయితీలో ఖాకీల ముష్టి యుద్ధం

సూర్యాపేట జిల్లా:నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వసూలైన పోలీస్ మామూళ్లు ఒక్కరే వాడుకోవడంతో కానిస్టేబుల్, హోంగార్డు మధ్య జరిగిన ముష్టి యుద్ధం జిల్లా ఎస్సీ దృష్టికి వెళ్లడంతో ఘటనకు బాధ్యులైన కానిస్టేబుల్ సంస్పెండ్ చేస్తూ,హోంగార్డు వీఆర్ కు అటాచ్ చేస్తూ శాఖాపరమైన చర్యలు తీసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పెన్ పహాడ్ ఎస్ఐ గోపికృష్ణ తెలిపిన ప్రకారం.మండల కేంద్రానికి చెందిన టీ స్టాల్ యజమాని నూతన సంవత్సర దావత్ కోసమని కానిస్టేబుల్ జాటోత్ రవికుమార్,హోంగార్డు గంజి శ్రీనుకు కలపి డిసెంబర్ 28న రూ.

1500 ఇచ్చాడు.ఆ డబ్బులు కానిస్టేబుల్ రవికుమార్ ఒక్కడే వాడుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి పిడిగుద్దులు కురిపించే వరకు వెళ్ళింది.

ఇదంతా.పోలీస్ స్టేషన్‌ కు వచ్చిన ప్రజల ముందే జరగడంతో విషయం జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ దృష్టికి వెళ్ళింది.

ఇద్దరు ఖాకీల ఘటనపై సిరియస్ అయిన ఎస్పీ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

వీడియో: పట్టపగలే దారుణం.. నర్సింగ్ విద్యార్థిని గొంతు నులిమి చంపబోయిన ప్రేమోన్మాది..