రాత్రికి రాత్రే లక్షాధికారి అయిన జాల‌రి.. ఎలాగంటే..?

అధృష్టం ఎప్పుడు ఏ రూపంలో వ‌రిస్తుందో చెప్ప‌డం అంత ఈజీ కాదు.కొంద‌రు రాత్రికి రాత్రే కోటీశ్వ‌రులు కావ‌డాన్ని కూడా మ‌నం చూస్తేనే ఉన్నాం.

ఇంకా చెప్పాలంటే మ‌న దేశంలో ఎక్కువ‌గా స‌ముద్ర జీవుల‌ను న‌మ్ముకుని బ్ర‌తుకుతున్న జాల‌ర్ల‌లో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం లాంటివి చూస్తూనే ఉన్నాం.

సాధార‌ణంగా మత్స్యకారుల జీవితం అంటేనే స‌ముద్రం మీద కొనసాగుతుంద‌ని చెప్పాలి.వారు నిత్యం స‌ముద్రం మీదే ఆధార‌ప‌డుతూ చేప‌ల వేటుకు బ‌య‌లు దేరుతారు.

ఇక ఇందులో భాగంగా అప్పుడప్పుడు వారికి అదృష్టం కూడా వ‌రిస్తుంది.వారి వ‌ల‌కు చిక్కే అరుదైన చేప‌లు లేదంటే అరుదైన వ‌స్తువుల కార‌ణంగా వారు మిలియనీర్లు అయ్యే అవకాశం వ‌స్తుంది.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటిదే జ‌రిగింది.అదేంటంటే ముంబై ప‌ట్ట‌ణానికి చెందిన పాల్ఘర్ జిల్లాలో నివ‌సిస్తున్న ఓ మత్స్యకారుడికి ల‌క్ చేప రూపంలో త‌గిలింది.

అదేంటంటే ఆయ‌న కలలో కూడా ఊహించని అదృష్ట‌మ‌నే చెప్పాలి.ఏకంగా ఆయ‌న రాత్రికి రాత్రి లక్షాధికారి అయ్యాడంటే అదృష్టం అలా ఉంది మ‌రి.

ఇక్క‌డ నివ‌సిస్తున్న ముర్బే గ్రామానికి చెందిన చంద్రకాంత్ ఎప్ప‌టి లాగే స‌ముద్రంలోకి చేపల వేటకోసం వ‌వెళ్లాడు.

"""/"/ కాగా అలా చేప‌లు ప‌డుతుండ‌గా ఆయ‌న వ‌ల‌లో చాలా బరువుగా అనిపించ‌డంతో దాన్ని కాస్తా చాలామంది కలిసి ఎంతో క‌ష్ట‌ప‌డి వలను ఒడ్డుకు తీసుకు వ‌చ్చారు.

ఇక దాన్ని చూస్తే వారంతా కూడా షాక్ అయిపోయారు.ఎందుకంటే ఆ వ‌ల‌లో 150 ‘హార్ట్ ఆఫ్ గోల్డ్’ చేపలు ప‌డ్డాయి.

ఇంకేముంది ఆయ‌న అదృష్టం పండింది.వాటిని అమ్మితే ఏకంగా రూ.

1 కోటి 33 లక్షలు ప‌ల‌కడంతో ఆయ‌న షాక్ అయిపోయారు.ఎందుకంటే ఈ చేప‌ల‌ను ఎక్కువ‌గా ఔషధాల తయారీలో వినియోగిస్తారు.

అందుకే వాటికి చాలా డిమాండ్ వ‌స్తుంద‌ని చెబుతున్నారు.

లైఫ్ లో ఎవరినీ నమ్మొద్దు.. వైరల్ అవుతున్న బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు!