95 రోజులు సముద్రంలో నరకం చూసిన మత్స్యకారుడు.. ఏం తిన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!

95 రోజులు సముద్రంలో నరకం చూసిన మత్స్యకారుడు ఏం తిన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!

95 రోజులు పసిఫిక్ మహాసముద్రంలో చిక్కుకుని నరకం చూసిన 61 ఏళ్ల పెరువియన్ మత్స్యకారుడు మాక్సిమో నపా(Peruvian Fisherman Maximo Napa) క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు.

95 రోజులు సముద్రంలో నరకం చూసిన మత్స్యకారుడు ఏం తిన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!

రెండు వారాల చేపల వేటకు (For Fishing) వెళ్లిన నపా తుఫాను వాతావరణం కారణంగా సముద్రంలో తప్పిపోయి ప్రాణాల కోసం పోరాడాల్సి వచ్చింది.

95 రోజులు సముద్రంలో నరకం చూసిన మత్స్యకారుడు ఏం తిన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!

తిండి కోసం తెచ్చుకున్న ఆహారం అయిపోవడంతో నపా కనిపించిన ప్రతిదాన్ని తినాల్సి వచ్చింది.

వారాల తరబడి పక్షులు, సముద్ర తాబేళ్లతో పాటు బొద్దింకలను కూడా తిని బతికాడు.

చివరి 15 రోజులు మాత్రం తిండి లేక పూర్తిగా ఆకలితో అలమటించాడు.ఆ భయానక పరిస్థితుల్లోనూ అతను మాత్రం చావకూడదని గట్టిగా అనుకున్నాడు.

తన కుటుంబాన్ని తలుచుకుంటూ మనో ధైర్యంతో బతికాడు. """/" / రక్షించిన తరువాత నపా (napa)తాను బతకడానికి ఎంత కష్టపడ్డాడో చెప్పాడు.

"నేను బొద్దింకలు, పక్షులు తిన్నాను.చివరికి తాబేళ్లను కూడా వదల్లేదు, అస్సలు చావాలని అనుకోలేదు" అని తెలిపాడు.

ఈక్వెడార్ సరిహద్దు దగ్గరలోని పైటాలో తన సోదరుడిని కలుసుకున్నప్పుడు నపా భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

తన కుటుంబ సభ్యుల గురించిన ఆలోచనలే తనను బతికించాయని నపా చెప్పాడు.ముఖ్యంగా రెండు నెలల వయస్సున్న మనవరాలు, తల్లి గుర్తుకు రావడంతోనే ఎలాగైనా బతకాలని అనుకున్నానని తెలిపాడు.

వర్షపు నీటిని పట్టుకుని దాహం తీర్చుకుంటూ, ఆకలితో అలమటిస్తూ ఉన్నా తన కుటుంబ సభ్యులే అతనికి అండగా నిలిచారు.

"రోజూ మా అమ్మ గురించే ఆలోచించేవాడిని" అని చెప్పాడు."దేవుడు నాకు రెండో జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞతలు" అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

"""/" / నపాను రక్షించిన ఫొటోలను పెరువియన్ నేవీ విడుదల చేసింది.ఒక ఫొటోలో నపా తన సోదరుడిని కౌగిలించుకుని ఉండగా, మరొక ఫోటోలో అతనికి వైద్య చికిత్స అందిస్తున్నారు.

ఈక్వెడార్ బోట్ 'డోన్ ఎఫ్' అండ్ పెరువియన్ మారిటైమ్ పెట్రోల్ వెసెల్ 'బి.

ఎ.పి.

రియో పియురా' సిబ్బంది నపాను రక్షించి వెంటనే వైద్య సహాయం అందించారు.నపా తల్లి ఎలెనా కాస్ట్రో స్థానిక మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడు తిరిగి వస్తాడని తాను దేవుడిని ప్రార్థించానని చెప్పింది.

"నా కొడుకు బతికున్నా, చనిపోయినా నాకు తిరిగి వచ్చేలా చేయమని దేవుడిని వేడుకున్నాను, కనీసం ఒక్కసారైనా వాడిని చూడాలని అనుకున్నా.

" అని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.అయితే ఆమె కూతుళ్లు మాత్రం తమ తండ్రి తిరిగి వస్తాడనే నమ్మకాన్ని వదలలేదని తెలిపింది.

"మా అమ్మాయిలు మాత్రం 'అమ్మా నాన్న వస్తాడు.తప్పకుండా వస్తాడు' అని చెబుతూనే ఉండేవారు" అని ఆమె గుర్తు చేసుకుంది.

అన్ని ఆశలు వదులుకున్న సమయంలో నపా అద్భుతమైన రీతిలో బతికాడు.ఇది నిజంగా నమ్మలేని ఒక అద్భుతం.

విశ్వాసం, ప్రేమ, మానవ సంకల్ప శక్తి ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించాడు.

డబ్బులిచ్చి నాపై ట్రోలింగ్ చేశారు.. హీరోయిన్ పూజా హెగ్డే సంచలన వ్యాఖ్యలు వైరల్!