నదిలో పడి ఆత్మహత్యకు యత్నం.. అతడిని బయటికి లాగి ఎట్లా కొట్టాడో చూస్తే..??

ఉత్తర ప్రదేశ్( Uttar Pradesh ) రాష్ట్రం, సుల్తాన్‌పూర్ సిటీలోని గోమతీ నదిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

ఒక జంట నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించగా, అక్కడ చేపలు పట్టేవారు వారిని కాపాడారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వీడియోలో ఒక మత్స్యకారుడు ఒక వ్యక్తిని నది నుంచి బయటకు లాగుతూ కనిపిస్తాడు.

ఆ వ్యక్తి మత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది.అతనిని కాపాడిన తర్వాత, చేప పట్టేవాడు అతన్ని ఆగ్రహంతో కొట్టాడు.

అదే సమయంలో, నది ఒడ్డున మరో ఇద్దరు మత్స్యకారులు ఒక మహిళకు సహాయం చేస్తూ కనిపిస్తారు.

ఆమె కూడా ఆ జంటలో ఒకరేనని తెలుస్తోంది. """/" / గురువారం నాడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఆత్మహత్య చేసుకోవాలని భావించిన ఆ జంట నదిలో దూకింది.అదృష్టవశాత్తు, అక్కడే ఉన్న మత్స్యకారులు వారిని గమనించి కాపాడారు.

మత్స్యకారులు( Fisherman ) ధైర్యంగా వ్యవహరించినప్పటికీ, వ్యక్తిని కొట్టిన ఓ మత్స్యకారుడి ప్రవర్తనపై ఆన్‌లైన్‌లో చర్చ జరుగుతోంది.

అతడు ఈ వ్యక్తిని కొట్టాల్సిన అవసరం లేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు ఏదో సరదాకి కొట్టినట్లు ఈ వ్యక్తి కొట్టాడని ఇది హర్షించదగిన ప్రవర్తన కాదని అంటున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. """/" / బాగ్‌పత్‌లో మరో విషాదం చోటు చేసుకుంది.

32 ఏళ్ల యశ్వీర్ అనే వ్యక్తిని తన అన్నయ్య మరణించిన తర్వాత అతని వితంతు వదిన రితును వివాహం చేసుకున్నందుకు అతని సోదరులు హత్య చేశారు.

యశ్వీర్ ఢిల్లీలో బస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.గత ఏడాది అతని సోదరుడు సుఖ్వీర్ మరణించడంతో, యశ్వీర్ అతని భార్య రితును పెళ్లి చేసుకున్నాడు.

ఈ పెళ్లి యశ్వీర్ మిగిలిన ఇద్దరు సోదరులు ఓంవీర్, ఉదయవీర్‌లకు నచ్చలేదు.దీంతో కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతుండేవి.

శుక్రవారం రాత్రి, యశ్వీర్ పని ముగించుకొని ఇంటికి వచ్చాడు.అప్పటికే మద్యం సేవించిన అతని సోదరులతో గొడవ మొదలైంది.

గొడవ తీవ్రరూపం దాల్చి, యశ్వీర్‌పై కాల్పులు జరిపి హత్య చేశారు.ఈ ఘటనలో ఓంవీర్, ఉదయవీర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఆకాశ్ జగన్నాధ్ పరిస్థితి ఏంటి..? తల్వార్ సక్సెస్ అవుతుందా..?