డిప్రెషన్‌లో ఉన్న‌వారు చేప‌లు తింటే ఏం అవుతుందో తెలుసా?

ఎంత‌టి బ‌ల‌వంతుడినైనా, ధ‌న‌వంతుడినైనా చిత్తు చిత్తు చేసే సైలెంట్ కిల్ల‌రే `డిప్రెష‌న్‌`.కోరుకున్న వారు దూర‌మ‌వ‌డం, అనుకున్నది జరగకపోవ‌డం, ప్రేమ విఫ‌ల‌మ‌వ‌డం, ఆర్థికంగా నష్టపోవ‌డం, ల‌క్ష్యాన్ని చేరుకోలేక‌పోవ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల నేటి యాంత్రిక యుగంలో చాలా మంది డిప్రెష‌న్ బారిన ప‌డుతున్నారు.

ఈ మాన‌సిక స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌లేక ప్ర‌తి రోజు ఎంద‌రో ప్రాణాల‌ను కూడా పోగొట్టుకుంటున్నారు.

అంత వ‌ర‌కు వెళ్ల‌కుండా ఉండాలంటే మొద‌టి ద‌శ‌లోనే అంటే మైల్డ్ స్టేజ్‌లోనే డిప్రెష‌న్‌ను నివారించుకోవాలి.

అందుకు కొన్ని కొన్ని ఆహారాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.అలాంటి ఆహారాల్లో చేప‌లు కూడా ఉన్నాయి.

చేప‌లు రుచిగా ఉండ‌ట‌మే కాదు బోలెడ‌న్ని పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.విట‌మిన్ బి, విటమిన్ డి, విట‌మిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫరస్, ఐర‌న్‌, మెగ్నీషియం, పొటాషియం.

జింక్‌, ప్రోటీన్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పోష‌కాలే చేప‌ల్లో లోడ్ చేయ‌బ‌డి ఉంటాయి.

"""/"/ అందుకే వారానికి ఒకసారైనా చేప‌లు తినాల‌ని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా డిప్రెష‌న్‌తో బాధ ప‌డే వారు ఖ‌చ్చితంగా చేప‌ల‌ను డైట్‌లో చేర్చుకోవాలి.

చేప‌ల్లో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు డిప్రెషన్‌ను త‌రిమికొడ‌తాయి.అలాగే మూడ్ స్వింగ్స్ తో పోరాడి మైండ్‌ను ప్ర‌శాంత‌గా మారుస్తాయి.

ఆందోళ‌న‌ను కూడా త‌గ్గేలా చేస్తాయి.అందువ‌ల్ల‌, ఎవ‌రైతే డిప్రెష‌న్‌తో ఇబ్బంది ప‌డుతున్నారో వారు వారానికి రెండు సార్లు చేప‌లు తిన‌డం అల‌వాటు చేసుకోండి.

చేప‌లే కాదు తాజా పండ్లు, ఆకుకూర‌లు, కూర‌గాయ‌లు, న‌ట్స్‌, పాలు, మ‌జ్జిగ వంటివి కూడా తీసుకోవాలి.

అలాగే ఎప్పుడూ ఒంట‌రిగా ఉండ‌కూడ‌దు.ఒంట‌రిత‌నం డిప్రెష‌న్‌ను మ‌రింత పెంచేస్తుంది.

ఇక ప్ర‌తి రోజు క‌నీసం ఇర‌వై నిమిషాల పాటు వాకింగ్ లేదా జాగింగ్ చేస్తే డిప్రెష‌న్‌ నుంచి త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డొచ్చు.

ఆ బాలీవుడ్ స్టార్ హీరో వల్లే ప్రభాస్ రాజసాబ్ లేటవుతుందా..?