రోగనిరోధక శక్తిని పెంచే ఫిష్‌ బిస్కెట్లు రెడీ..!

చేపలు తినడం అంటే చాలా మందికి ఇష్టం.ఈ చేపలు తినడం ద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

అందుకే చాలా మంది డాక్టర్లు చేపలను ఎక్కువగా తినమని రోగులకు సలహాలు ఇస్తుంటారు.

ఈ చేపలు తినడం ద్వారా రోగ నిరోధక శక్తి అనేది పెరుగడమే కాదు అనేక రకాల జబ్బుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

చేపలలో ఎక్కువగా ఓమెగా ఉంటుంది.చేపలను ఎక్కువ తింటే అందులో ఫైబర్‌ కంటెంట్‌ అధిక స్థాయిలో ఉంటుంది.

దానినే దృష్టిలో ఉంచుకుని పంజాబ్‌లోని లూధియానా ఫిషరీస్‌ కళాశాల ఫిష్‌ బిస్కెట్లను తయారు చేసింది.

ఈ బిస్కెట్లో కోవిడ్‌ మహమ్మారికి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తి పెంచేందుకు ఎంతగానో ఉపయోగ పడుతాయని వారు తెలియజేస్తున్నారు.

ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ను దృష్టిలో ఉంచుకుని చేపలతో చేసిన ఇటువంటి బిస్కెట్లను తయారు చేస్తున్నట్లుగా ఆ కళాశాలకు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు తెలియజేస్తున్నారు.

"""/" / కరోనా మహమ్మారి సమయంలో ఇలాంటి ప్రొటీన్స్‌ అందడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి.

ఈ చేపతో చేసిన బిస్కెట్లను తినడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు.అంతే కాకుండా రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

అధిక ప్రోటీన్లు కలిగిన బిస్కెట్లు అన్ని కూడా నాణ్యతతో పాటు అనేక ఆరోగ్య విలువలను కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే చేపలతో తయారు చేసే ఈ బిస్కెట్లకు చేపల వాసన అనేది అస్సలు ఉండదని చెబుతున్నారు.

ఈ వాసన ఉండకపోవడం వలన పిల్లలు రుచికమైన బిస్కెట్లను తినేందుకు ఇష్టపడుతారని వారు అంటున్నారు.

కరోనాను అంతం చేయడానికి పరిశోధకులు అనేక రకాల పరిశోధనలు చేస్తున్నారు.ఇటువంటివి తయారు చేయడం వల్లన చాలా మందికి ప్రయోజనం చేకూరుతుందని వైద్యులు తెలుపుతున్నారు.

కొత్త రకం డైపర్స్ లాంచ్ చేసిందని జపాన్… వీటి ప్రయోజనాలు ఏంటంటే..