యువతికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన కామాంధులు..!
TeluguStop.com
ఇటీవలే కాలంలో పనుల కోసం బయటకు వెళ్తున్న మహిళలలో సగానికి పైగా మహిళలు కామాంధుల చేతులలో బలి అవుతున్నారు.
సమాజంలో మానవత్వం అనేది లేకుండా పోతుంది.చదువుకునే విద్యార్థినిల నుంచి ఉద్యోగాలు చేసే మహిళల వరకు బయట ప్రపంచంలో తిరిగే కామాంధుల నుండి ముప్పు ఉంది.
ఇలాంటి కోవకు చెందిన ఘటన కేరళలో( Kerala ) చోటు చేసుకుంది.కాలేజీలో చదివే ఓ యువతికి మత్తుమందు ఇచ్చి, అత్యాచారం చేసి దారి పక్కన వదిలేసి వెళ్లారు కొందరు కామాంధులు.
ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. """/" /
వివరాల్లోకెళితే.
మే 30న గ్రాడ్యుయేట్ మొదటి సంవత్సరం చదువుతున్న యువతి అదృశ్యమయింది.కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ పై ఫిర్యాదు చేశారు.
పోలీసులు కుటుంబ సభ్యుల దగ్గర ఆ యువతి కు సంబంధించిన వివరాలు తెలుసుకొని పూర్తిస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఇంతలో ఆ యువతి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది.కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సురక్షితంగా ఆమెను రక్షించారు.
శుక్రవారం ప్రాణాలతో బయటపడిన ఆ యువతి చెప్పిన వివరాలు పోలీసులు సేకరించి, ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నారు.
"""/" /
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.తామరస్సేరి పోలీస్ స్టేషన్( Thamarassery Police Station ) పరిధిలో ఉండే తన కళాశాల సమీపంలో మహిళ పేయింగ్ గెస్ట్ గా ఉంటుంది.
ఈ విషయం గమనించిన కొందరు కామాంధులు కాపు కాసి ఆ మహిళను కిడ్నాప్ ( Kidnap ) చేశారు.
ఆ తర్వాత ఆ మహిళకు మత్తుమందు ఇచ్చి అతి దారుణంగా అత్యాచారం చేశారు.
తమ కోరిక తీరిన తర్వాత వయనాడ్ ను కోజికొడ్ ను కలిపే తామరస్సేరి చురం పర్వతం వద్ద వదిలేసి వెళ్లిపోయారు.
ఆ తర్వాత మహిళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేయడం, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.
అత్యాచారం కేసు నమోదు చేసి నిందితులను గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
How Modern Technology Shapes The IGaming Experience