పవన్ మాట తొలిసారి కాదు అన్న త్రివిక్రమ్.. ఏ విషయంలో అంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాతో మరొకసారి వెండి తెరపై కనిపించి ప్రేక్షకులను అలరించాడు.

ఈ సినిమా పవన్ కెరీర్ లోనే మరొక సూపర్ హిట్ సినిమాగా నిలిచి పోయింది.

ఈ సినిమా ఇచ్చిన ఫుల్ జోష్ తో వరుస సినిమాలు చేస్తూ క్షణం కూడా తీరిక లేకుండా బిజీగా గడుపు తున్నాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు.అందులో 'హరి హర వీరమల్లు' సినిమా ఒకటి.

ఈ సినిమా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిన షూటింగ్ ఇప్పటి వరకు జరగలేదు.అయితే త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు తీసుకు వెళ్లి షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేయాలనీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు.

పవన్ లైనప్ లో భవదీయుడు భగత్ సింగ్ కూడా ఉన్న విషయం తెలిసిందే.

హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్క బోతున్న ఈ సినిమా సమ్మర్ లో సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇక ఈ రెండు సినిమాలే కాకుండా పవన్ మరొక రీమేక్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

"""/" / గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించిన ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.

వినోదయ్యా సిత్రం అనే తమిళ రీమేక్ సినిమాను చేయనున్న పవన్ ఈ రీమేక్ బాధ్యతలను తమిళ్లో డైరెక్ట్ చేసిన సముద్రఖని కె ఇచ్చినట్టు టాక్.

అయితే తెలుగులో ఈ సినిమాకు డైలాగ్స్ రాసే  బాధ్యతను త్రివిక్రమ్ కు ఇస్తే అందుకు ఆయన నో చెప్పాడట.

పవన్, త్రివిక్రమ్ మధ్య స్నేహ బంధం ఎలాంటిదో టాలీవుడ్ ప్రతి ప్రేక్షకుడికి తెలుసు.

పవన్ ఏదైనా చెబితే ఎప్పుడు కాదు అనను  అని, ఇప్పుడు  త్రివిక్రమ్ మొదటిసారి ఆయనకు నో చెప్పాడట.

"""/" / పవన్ చేయ బోయే ఈ రీమేక్ సినిమాకు డైలాగ్స్ రాయమని పవన్ త్రివిక్రమ్ ను కోరగా ఆయన నో చెప్పాడట.

ప్రెసెంట్ త్రివిక్రమ్ మహేష్ సినిమా పనులతో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు పని చేసేంత సమయం లేక ఈయనకు అప్పగించిన బాధ్యతలను త్రివిక్రమ్ మరొక రచయిత సాయి మాధవ్ బుర్రాకు అప్పగించాలని అనుకుంటున్నాడట.

ఏదైతేనేం పవన్ అడిగిన సాయం మొదటిసారి త్రివిక్రమ్ ఒప్పుకోలేక పోయాడు.అందుకు ఆయన బిజీ షెడ్యూల్ అనే తెలుస్తుంది.

ఐటీ జాబ్స్ కోసం ఇంత పోటీనా.. ఈ వీడియో చూస్తే స్టూడెంట్ల గుండెలు అదిరిపోతాయి!