విడ్డూరం : 100 ఏళ్లు దాటిన తర్వాత ప్రేమ, ప్రపంచంలోనే వీరిది అత్యంత అరుదైన ప్రేమ

ప్రేమకు కులం మతం ఉండదు.ప్రేమ గుడ్డిదని అంతా అంటూ ఉంటారు.

కొన్ని సంఘటనలు చూస్తూ నిజమే అనిపిస్తుంది.ఇక ప్రేమ వయసును చూడదని కూడా మనం ఇప్పటి వరకు వార్తల్లో చూశాం.

20, 30 ఏళ్ల వయసు తేడా ఉన్న వారు కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న దాఖలాలు ఉన్నాయి.

అయితే మొదటి సారి 100 ఏళ్లు దాటిన తర్వాత కలుసుకున్న ముసలి వాళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు.

ఈ అరుదైన సంఘటన అమెరికాలోని ఒహాయో రాష్ట్రంలో జరిగింది. """/"/ పూర్తి వివరాల్లోకి వెళ్తే ఒహాయో రాష్ట్రంలోని ఒక ఓల్డ్‌ఏజ్‌ హోం ఉంది.

అక్కడ ఎంతో మంది వృద్దులు ఉంటారు.అందులో ఇద్దరు ప్రేమించుకుని ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.

విచిత్రం ఏంటీ అంటే వరుడు జాన్‌ కుక్‌కు 100 ఏళ్లు తాజాగా పూర్తి అయ్యాయి.

ఇక వధువు ఫిల్లిస్‌ ప్రస్తుతం 103 ఏళ్ల వయసును కలిగి ఉంది.వీరిద్దరు కొన్ని సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారు.

ఓల్డేజ్‌ హోంలో వీరిద్దరు ప్రతి రోజు మాట్లాడుకోవడం, ఒకరి అనుభవాలు ఒకరు షేర్‌ చేసుకోవడం చేసేవారు.

అలా ఇద్దరి మద్య సన్నిహిత్యం పెరిగింది. """/"/ ఇద్దరి జీవిత భాగస్వామ్యులు చనిపోయి ఒంటరిగా ఉన్నారు.

దాంతో వారిద్దరు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు.పెళ్లి చేసుకునేందుకు ఇరు కుటుంబ సభ్యులను సంప్రదించారు.

వారు మీ ఇష్టం అంటూ సమాధానం చెప్పడంతో పెళ్లికి సిద్దం అయ్యారు.ఇటీవలే పెళ్లి చేసుకున్న వీరు ప్రస్తుతం ఓల్డ్‌ఏజ్‌ హోంలోనే కలిసి ఉంటున్నారు.

వీరి ప్రేమ ప్రపంచంలోనే అత్యంత అరుదైన ప్రేమగా రికార్డు సృష్టించింది.వంద ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్న మొదటి జంట వీరిదే అంటూ అమెరికా అధికార వర్గాల వారు అంటున్నారు.

సూర్య ఎందుకు ఆ డైరెక్టర్ తో సినిమాను చేస్తున్నాడు..?