తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత

తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్( News Reader Shanthi Swaroop ) కన్నుమూశారు.

హైదరాబాద్ లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.రెండు రోజుల క్రితం గుండెపోటు ( Heart Attack ) రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు.

"""/" / ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ శాంతిస్వరూప్ కన్నుమూశారు.అయితే 1983 నవంబర్ లో దూరదర్శన్ ఛానెల్ లో( Doordarshan ) శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు.

సుదీర్ఘ కాలం దూరదర్శన్ లో శాంతి స్వరూప్ న్యూస్ రీడర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.

2011లో పదవి విరమణ చేశారు.

వైరల్ వీడియో: పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?