ఆ లైబ్రరీలో పుస్తకం చదవాలంటే ఇదే కండీషన్.. తెలిస్తే భేష్ అంటారు!
TeluguStop.com
స్ట్రీట్ లైబ్రరీ అంటే ఓపెన్ లైబ్రరీ అని అర్థం.ఇక్కడ పాఠకులు పుస్తకాలు తీసుకొని చదవొచ్చు.
అయితే మన దగ్గరున్న ఒక పుస్తకం ఇచ్చి, వారి నుంచి మరో పుస్తకం తీసుకోవాలనేది ఇక్కడి కండీషన్.
ఈ కాన్సెప్ట్ విదేశాల నుండి వచ్చినప్పటికీ, భారతదేశంలో కూడా చాలా చోట్ల విజయవంతంగా అమలవుతోంది.
స్ట్రీట్ లైబ్రరీ దక్షిణ భారతదేశంతో పాటు ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రదేశాలలో నడుస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో కొన్ని నెలల క్రితం ఇటువంటి లైబ్రరీ ప్రారంభమైంది.రిషికేశ్‌లోని లక్ష్మణ్ జూలా సమీపంలో గంగానది ఒడ్డున ఈ వీధి లైబ్రరీని ఉంది.
దీనిని బస్తా ప్యాక్ అడ్వెంచర్ సృష్టికర్త గిరిజన్ష్ గోపాలన్, అతని సహచరులు ఏర్పాటు చేశారు.
ఈ లైబ్రరీలో చాలా పెద్ద సెక్షన్ ఉందని, అయితే కొన్ని పుస్తకాలు అందుబాటులో లేవని గిరిజన్ష్ చెప్పారు.
దీనికి వెనుక ఆర్థిక కారణాలున్నాయన్నారు.ఇక్కడ పాఠకులు గంగానది ఒడ్డున కూర్చుని అందమైన దృశ్యాలను ఆస్వాదిస్తూ పుస్తకాలు చదవవచ్చని గిరిజన్ష్ తెలిపారు.
ఇక్కడ నుంచి ఎవరైనా తమతో ఒక పుస్తకాన్ని తీసుకెళ్లాలనుకుంటే, దానికి బదులుగా మరొక పుస్తకాన్ని ఇవ్వాలన్నారు.
కొంతమంది ఈ లైబ్రరీకి పుస్తకాలను విరాళంగా ఇస్తున్నారని గిరిజన్ష్ తెలిపారు.సోషల్ మీడియాతో కనెక్ట్ అయిన వారు తమను సంప్రదించి పుస్తకాలు పంపిస్తున్నారన్నారు.
ఈ ప్రచారంలో గిరిజన్ష్‌కు ఢిల్లీ యూనివర్సిటీతో పాటు కొన్ని సంస్థలు సహకారం అందిస్తున్నాయి.
కాగా ఈ స్ట్రీట్ లైబ్రరీకి ఎదురుగా ఒక ఫలహారశాల ఉంది.చాలామంది ఇక్కడికి వచ్చి పలు పుస్తకాలు ఇస్తున్నారు.
అయితే లైబ్రరీని నిర్వహించడంలో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు.చాలా పుస్తకాలు చోరీకి గురవుతున్నట్లు తెలిపారు.
చదువుతామనే సాకుతో కొందరు పుస్తకాలు తీసుకు వెళ్లి మరి తిరిగి వెనక్కు తీసుకు రావడం లేదని పేర్కొన్నారు.
పుస్తకాలు తీసుకెళ్లడం తప్పు కాదని, అయితే వారు తీసుకెళ్లిన పుస్తకం స్థానంలో మరో పుస్తకం ఉంచాలని నిర్వాహకులు చెబుతున్నారు.
పుష్ప 2 విడుదలపై టీడీపీ ఎంపీ షాకింగ్ పోస్ట్.. వెంటనే డిలీట్.. మాకు సెంటిమెంట్ అంటూ!