భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్..!

ఐసీసీ వన్డే ప్రపంచకప్ సమరం మొదలు కావడానికి ఇంకాస్త సమయం ఉండగా ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగబోతున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా మొహాలీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది.

ఈ క్రమంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.టీమిండియా పగ్గాలను కేఎల్‌ రాహుల్‌ చేతిలో ఉండగా ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు చేపడుతున్నారు.

ఆసియా కప్‌ గెలిచి జోష్‌ మీదున్న టీమిండియా ఇప్పుడు తమ ఫోకస్‌ అంతా అగ్రస్థానంపైనే పెట్టింది.

ప్రస్తుతం టాప్‌-2గా ఉన్న భారత్‌.ఈ సిరీస్‌లో ఆసీస్‌ను ఓడించి ప్రపంచకప్‌లో నెంబర్‌ వన్ జట్టుగా నిలవాలనే కసితో ఉంది.

మరోవైపు ఆసీస్‌ కూడా ఈ టోర్నీలో మరోసారి సత్తా చాటుకోవాలని చూస్తుంది.దీంతో మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరో యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన చిరంజీవి.. భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా?