పిల్లలకు తొలిఒడి అమ్మ- మలిఒడి అంగన్వాడి కేంద్రం

రాజన్న సిరిసిల్ల జిల్లా :పిల్లలకు తొలి ఒడి అమ్మ అయితే.మలిఒడి అంగన్‌వాడీ కేంద్రాలే కావాలనే లక్ష్యంతో ప్రభుత్వ ఆదేశాలతో ‘అమ్మ మాట- అంగన్‌వాడీ బాట కార్యక్రమాన్ని చందుర్తి మండలం మల్యాల గ్రామ అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్, వివో సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించారు.

ఇప్పటికే దీనికి సంబంధించి అంగన్వాడీ టీచర్లకు విడతల వారిగా శిక్షణ ఇచ్చారు.స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా రెండున్నరేళ్ల వయసున్న చిన్నారులను మరియు మూడు నుండి ఆరు సంవత్సరాల పిల్లలను అంగన్వాడిలో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది .

చిన్నారులకు అక్షరాలు, అంకెలు, ఆటపాటలతో కూడిన విద్యను బోధిస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వివో అధ్యక్షురాలు మంజుల, శ్రీనివాస్, ధనలక్ష్మి గ్రూప్ సిఎ జె గంగ ,అంగన్వాడి ఉపాధ్యాయురాలు జ్యోతి, సంధ్య, మంజుల, సహాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

బ్లాక్ బస్టర్ హిట్స్‌ను కొద్దిలో మిస్ చేసుకున్న స్టార్ యాక్టర్స్‌.. ఎవరంటే..?