BJP: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల..!!

తెలంగాణ రాష్ట్రంలో మరి కొద్ది రోజులలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాల వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ( Congress Party ) విజయం సాధించింది.

ఈ క్రమంలో ఈ పార్లమెంటు ఎన్నికలలో కూడా విజయం సాధించి.మరింత బలపడేందుకు టీకాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇక అధికారం కోల్పోయిన బీఆర్ఎస్( BRS ) పార్లమెంట్ ఎన్నికలలో సత్తా చాటడానికి రెడీ అవుతుంది.

"""/" / కాగా గత అసెంబ్లీ ఎన్నికలలో( Assembly Elections ) ఆశించిన స్థాయిలో రాణించ లేకపోయినా బీజేపీ.

పార్లమెంట్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.దీంతో తెలంగాణకు బీజేపీ కీలక నాయకులు అమిత్ షా, మోదీ వాటి నేతలు ఎన్నికలలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గాన్ని అమిత్ షా దగ్గర ఉండి నడిపిస్తున్నారు.

దీంతో తాజాగా పార్లమెంట్ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి బీజేపీ అధిష్టానం మొదటి లిస్టు విడుదల చేయడం జరిగింది.

కరీంనగర్ - బండి సంజయ్ నిజామాబాద్ - అర్వింద్ జహీరాబాద్ - బీబీ పాటిల్ మల్కాజిగిరి - ఈటల రాజేందర్ సికింద్రాబాద్ - కిషన్ రెడ్డి హైదరాబాద్ - మాధవీలత చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాగర్ కర్నూల్ - భరత్ భువనగిరి - బూర నర్సయ్య గౌడ్.

విమానం ఇంజన్‌లోకి దూసుకెళ్లిన పక్షి.. చివరికి ఏమైందో చూడండి..