కాంగ్రెస్ పార్టీ నాయకులు రామగిరి తిరుపతిరావు ప్రథమ వర్ధంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కీ.

శే రామగిరి తిరుపతిరావు గారి ప్రథమ వర్ధంతి కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా కీర్తిశేషులు రామగిరి తిరుపతి రావు చిత్రం పటానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆయన కుమారుడు రామగిరి మారుతి రావు కుమార్తెలు మాధురిరావు జోష్ణ రావు, మేన బావలైన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల కో కన్వీనర్ కొండూరి గాంధీ బాపు , కేడీసీసీ జిల్లా చైర్మన్ కొండూరి రవీందర్రావు , తిమ్మాపూర్ సింగల్ విండో అధ్యక్షులు సుధీర్రావు, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సిహేచ్ కమలాకర్ రావు, వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ చొక్కారావు కుమారులు జేఎన్ రావు, సురేష్ రావులు బంధుమిత్రులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

కీర్తిశేషులు రామగిరి తిరుపతిరావు కరీంనగర్ మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ జువ్వాడి చొక్కారావు కూతురు ఉమా ను వివాహం చేసుకున్నారు, వీరికి ముగ్గురు సంతానం కలరు.

సంవత్సరం క్రితం తిరుపతిరావు అనారోగ్యంతో మరణించారు కాగా నేడు ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని ఆయన కుమారుడు మారుతీ రావు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు బంధుమిత్రులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొని తిరుపతిరావు కు నివాళులర్పించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి2, గురువారం2025