ముందు మంత్రివర్గ ప్రక్షాళన... తరువాత ముందస్తు ... ? 

దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ను జనాల్లోకి తీసుకువెళ్లి, అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల్లో పోటీకి దింపేందుకు,  కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడకుండా చేసేందుకు ఆ పార్టీ అధినేత కేసిఆర్ వ్యూహాల్లో మునిగి తేలుతున్నారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ పార్టీ శాఖలను విస్తరించేందుకు,  రాష్ట్ర కార్యవర్గాలను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ ను సక్సెస్ చేయడం ఎంత ముఖ్యమో,  అంతకంటే ముఖ్యంగా తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత కేసిఆర్ పై ఉంది.

2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువస్తేనే.దేశవ్యాప్తంగా ఆ పార్టీ ప్రభావం చూపించేందుకు అవకాశం ఏర్పడుతోంది.

దీంతో ఈ వ్యవహారాలపైనే కేసీఆర్ పూర్తిగా దృష్టి సారించారు .అంతకంటే ముందుగా తెలంగాణ మంత్రి వర్గాన్ని  ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారు.

ఇటీవల కాలంలో చాలా మంది మంత్రులపై అవినీతి విమర్శలు రావడం,  ఈడి, ఐటి సంస్థలు రంగంలోకి దిగి విచారణలు చేస్తుండడం వంటివి కేసిఆర్ కు తలనొప్పిగా మారాయి.

తెలంగాణ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి తప్పించిన దగ్గర నుంచి కెసిఆర్ మంత్రివర్గ విస్తరణ చేపడతారని ప్రచారం జరుగుతున్న,  ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూనే వస్తోంది.

ఎమ్మెల్సీగా కవిత విజయం సాధించిన సమయంలో మంత్రివర్గ విస్తరణ చేపడతారని ఆమెకు మంత్రి పదవి కట్టబడతారని ప్రచారం జరిగింది.

దీంతో పాటు రాజ్యసభ సభ్యుడుగా ఉన్న బండ ప్రకాష్ కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు  వెంకటరామిరెడ్డి చేత పదవీ విరమణ చేయించి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు .

  """/"/  దీంతో అప్పట్లోనే మంత్రివర్గ విస్తరణ చేపడుతారని అంత ఆశలు పెట్టుకోగా , కేసీఆర్ మాత్రం సైలెంట్ అయిపోయారు .

అయితే ఇప్పుడు కచ్చితంగా మంత్రివర్గ పునర్వస్తీకరణ చేసే ఆలోచన ఉన్నట్లుగా బీఆర్ఎస్ కీలక నాయకులు కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ప్రస్తుతం వివాదాల్లో ఉన్న మంత్రులను తప్పించి వారి స్థానంలో కొంతమంది ఎమ్మెల్సీలకు, సామాజిక వర్గాల లెక్కల్లో కొంతమంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ముందుగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టి, ఆ తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లుగా బీఆర్ఎస్ లోని కొంతమంది కీలక వ్యక్తుల ద్వారా తెలుస్తోంది.

 .