రెండు ప్రాణాలు తీసిన బాణాసంచాలు.. అస‌లు కార‌ణం ఏంటంటే..?

మ‌న దేశంలో దీపావ‌ళి అంటేనే ప‌టాకులు పేల్చి సంబురాలు చేసుకోవ‌డం ఆది నుంచి వ‌స్తున్న సాంప్ర‌దాయం క‌దా.

ఇదే క్ర‌మంలో నిన్న కూడా దేశ వ్యాప్తంగా ఇలాగే దీపావ‌ళి జ‌రుపుకున్నారు.అయితే ఈ దీపావ‌ళి వేళ హైదరాబాద్ మ‌హా న‌గ‌రంలోని పాతబస్తీలో దారుణం చోటు చేసుకుంది.

బాణాసంచాల పేలుడుకు ఇద్ద‌రి ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయి.అదేంటి బాణా సంచాలు పేలిస్తే ఇలా జ‌ర‌గ‌డ‌మేంట‌ని మీరు అనుకోవ‌చ్చు.

కానీ ఇందుకు కార‌ణాలు కూడా ఉన్నాయి.టపాసులకు ఇత‌ర ప్రాణాపాయ రసాయనాలు ఆడ్ కావ‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది.

పాత‌బ‌స్తీలోని ఛత్రినాక ప్రాంతంలో నిన్న దీపావ‌ళి వేడుకలు భారీగానే జ‌రిగాయి.అయితే ఈ ప్రాంతంలో ఉండే పశ్చిమ బెంగాల్ స్టేట్ కు చెందిన‌టువంటి విష్ణు అలాగే జగన్నాథ్ అనే ఇద్ద‌రు అదే ఏరియాలో విగ్రహాల్ని తయారుచేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు.

పీవోసీ కంపెనీలో ఈ ఇద్ద‌రూ పని చేస్తుంటారు.అయితే వీరిద్ద‌రూ అంద‌రిలాగే దీపావళిని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని భావించారు.

కానీ ఇక్క‌డే వారు ఓ మిస్టేక్ చేశారు.అదేంటంటే విగ్రహాల్ని తయారు చేసేందుకు ఉప‌యోగించే ర‌సాయ‌నాల‌ను బాణాసంచాల‌కు ఉప‌యోగించారు.

"""/"/ ఇలా విగ్ర‌హాల ర‌సాయ‌నాల‌ను బాణాసంచాల‌తో క‌ల‌ప‌డంతో అది కాస్తా మార‌ణ హోమానికి దారి తీసింది.

పేలుడు తీవ్రత పెరిగిపోవడంతో దాన్ని అంటించిన వెంట‌నే భారీ ఎత్తున పేలుడు సంభ‌వించింది.

ఇందులో ఒక‌రు అక్క‌డిక‌క్క‌డే మ‌ర‌ణించ‌గా మ‌రొక‌రు ప్రాణాపాయ స్థితిలో ఆస్ప‌త్రిలో మ‌ర‌ణించాడు.ఈ ఘ‌ట‌న ఒక్క‌సారిగా అంద‌రినీ ఉలిక్కి ప‌డేలా చేసింది.

కాగా పేలుడు ఘ‌ట‌న తెలియ‌గానే పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.అస‌లు దీనికి గ‌ల కార‌ణాలు ఏంటని వారు ఆరాతీస్తున్నారు.

ఈ ఘ‌ట‌న ఇప్పుడు పెద్ద ఎత్తున వైర‌ల్ అవుతోంది.బాణాసంచా కాల్చే క్ర‌మంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెబుతున్నారు.

‘ఫుడ్ రెస్క్యూ’ పేరిట సగం ధరకే ఫుడ్.. జొమాటోలో కొత్త ప్రయోగం