రోడ్ షోలో అగ్నిప్రమాదం ! తృటిలో తప్పించుకున్న రాహుల్ గాంధీ

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది.కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

నవంబర్ 28న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జబల్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ ర్యాలీని నిర్వహించింది.

రాహుల్ కు హరతి ఇచ్చేందుకు కార్యకర్తలు హారతి పళ్లెంతో వచ్చారు.పక్కనున్న మిగతా వారి చేతిలో గ్యాస్ తో నింపిన బెలూన్లు ఉన్నాయి.

అత్యుత్సాహం ప్రదర్శించడంతో హారతి దీపాలు బెలూన్లకు తగిలి మంటలు చెలరేగాయి.వెంటనే మంటలు ఆరిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

మంటలు వెంటనే ఆరినా కొందరు కార్యకర్తలు ప్రాణభయంతో పరుగులు తీశారు.ప్రమాదం జరిగిన సమయంలో రాహుల్ గాంధీతో పాటు, కమల్ నాథ్, జ్యోతిరాధిత్య సింథియా పక్కనే ఉన్నారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ .