ఊహించని సంఘటన..అమెరికా క్యాపిటల్ భవనం వద్ద మంటలు..!!

అమెరికాకు నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బిడెన్ కమలా హారిస్ లు ప్రమాణ స్వీకారం ఈ నెల 20 న ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారానికి ఇంకా కొన్నిగంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది.ఎలాంటి అవాంచనీయమైన సంఘటనలు జరగకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.

జనవరి 6 వ తేదీన బిడెన్ ను అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారికంగా నిర్ణయిస్తున్న తరుణంలో ట్రంప్ మద్దతు దారులు వేలాదిగా వచ్చి అమెరికా క్యాపిటల్ భవనంపై దాడులు చేసిన ఘటన అందరికి గుర్తుఉండే ఉంటుంది.

ప్రతీ అమెరికన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.అయితే అదే తరహా ఘటనలు బిడెన్ ప్రమాణ స్వీకార సమయంలో కూడా ఉత్పన్నమవుతాయన్న నేపధ్యంలో కట్టుదిట్టమైన బద్రతను ఏర్పాటు చేశారు.

వాషింగ్టన్ ప్రాంతం మొత్తం లాక్ డౌన్ స్టేజ్ లోకి వెళ్ళిపోయింది.అమెరికాలోని అన్ని బద్రతా బలగాలు ప్రమాణ స్వీకారం జరిగే ప్రాంతం మొత్తాన్ని అధీనంలోకి తీసుకుంది.

ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు కనపడినా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అరెస్ట్ లు చేస్తున్నారు.

అణువణువూ ఎంతో జాగ్రత్తగా గాలిస్తున్న క్రమంలో అమెరికా క్యాపిటల్ వద్ద మంటలు చెలరేగడం అందరిని షాక్ కి గురిచేసింది.

అమెరికా క్యాపిటల్ వద్ద బలగాలు ఉన్నాయని అయినా మంటలు ఎలా వచ్చాయో అర్ధం కావడం లేదని అంటున్నారు అధికారులు.

కొందరు ప్రత్యక్షంగా ఆ మంటలు చూసి ఫైర్ సిబ్బందికి తెలియజేయగా మంటలను ఆర్పడం జరిగింది.

ప్రస్తుతం అక్కడ ఎలాంటి మంటలు లేవని, వెంటనే స్పందించామని ఫైర్ సిబ్బంది తెలిపారు.

ప్రస్తుతానికి క్యాపిటల్ భవనం నుంచీ ఎవరూ బయటకి రావడం కానీ లేదంటే బయటి వారు లోనికి వెళ్ళడం గాని అనుమతి లేదని తేల్చి చెప్పారు.

ప్రమాణ స్వీకారం అయ్యేంత వరకూ కూడా ఈ నిభందన అమలులో ఉంటుందని తేల్చి చెప్పారు.

అయితే క్యాపిటల్ భవనం వద్ద మంటలు ఎలా వచ్చాయనే దానిపై విచారణ చేపట్టారు అధికారులు.

కులాల మధ్య యుద్ధం కాదు.. క్లాస్ వార్..: సీఎం జగన్