విశాఖపట్నం ఆంద్రప్రదేశ్ ఫైబర్ నెట్ సబ్ కంట్రోల్ రూమ్ లో అగ్నిప్రమాదం..

విశాఖ పెందుర్తి సుమారు 25 లక్షలు ఆస్తి నష్టం వివరాల్లోకెళ్తే పెందుర్తి ఏపీ ఈపీడీసీఎల్, కార్యాలయంలో ఏపీ ఫైబర్ సబ్ కంట్రోల్ రూమ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 11:30 ప్రాంతంలో మంటలు చెలరేగాయి దీంతో అక్కడ ఉన్న ఔట్సోర్సింగ్ లో పనిచేస్తున్న ఉద్యోగులు విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపు చేస్తూ అగ్నిమాప సిబ్బందికి సమాచారం అందించారు.

దీంతో అక్కడ చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అప్పటికే మంటలు అదుపులోకి రావడంతో అక్కడ ఉన్నవారితో ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొన్నారు.

అయితేషార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.ఈ ప్రమాదం వల్ల పెందుర్తి సబ్బవరం చోడవరం పరిసర ప్రాంతాలకు రెండు రోజులపాటు ఏపీ ఫైబర్ సేవలు అందకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు.

ఘటన స్థలమునకు చేరుకున్న ఏపీ ఫైబర్ అధికారులు వీలైనంత త్వరగా తమ సేవలు పునరుద్దించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.

దేవుడా.. అది కడుపా లేక రాళ్ల గనా.. కడుపులో ఏకంగా 6110 రాళ్లు..