ట్రంప్ షూటింగ్ ఎటాక్: చనిపోయిన యూఎస్ పౌరుడు ఒక రియల్ హీరో..??

పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్ ర్యాలీ చేపడుతుండగా కాన్పులు జరిగిన సంఘటన తెలిసిందే.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌( Donald Trump )ను హత్య చేయడానికి కాల్పులు జరిపారు.

ఇందులో ఆ ఎన్నికల ప్రచారంలో హాజరైన ఓ వ్యక్తి కూడా చనిపోయారు.మరణించిన అతడిని కోరీ కాంపెరేటోర్‌( Corey Comperatore (గా అధికారులు గుర్తించారు.

పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో ప్రకారం, కంపరేటోర్ ఒక మాజీ ఫైర్ చీఫ్.

అగ్నిమాపక ఉద్యోగంలో ఆయన ఎంతోమంది ప్రాణాలను కాపాడారు.అందుకే అతను ఒక రియల్ లైఫ్ హీరో అని అధికారులు వెల్లడించారు.

ట్రంప్ 2024 ఎన్నికల ప్రచారంలో భాగమైన ఈ కార్యక్రమానికి 10,000 మందికి పైగా హాజరయ్యారు.

వారిలో కంపరేటోర్ కూడా ఉన్నారు. """/" / గవర్నర్ షాపిరో మాట్లాడుతూ, “నేను కోరీ భార్య, ఇద్దరు కుమార్తెలతో మాట్లాడాను.

కోరీ ఒక లవింగ్ ఫాదర్.అగ్నిమాపక సిబ్బందిలో పని చేశారు.

రోజూ చర్చికి వెళ్తుంటారు.అతను తన సంఘాన్ని, కుటుంబాన్ని ఎంతో ప్రేమించేవారు.

" అని తెలిపారు.కోరీ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు పెద్ద ఫ్యాన్ అని, ర్యాలీకి హాజరయ్యేందుకు ఉత్సాహంగా ఉన్నారని గవర్నర్ షాపిరో పేర్కొన్నారు.

ఆదివారం, డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలో జరిగిన హత్యాయత్నం నుంచి బయటపడడం దేవుడు కృపవల్లే జరిగిందని అన్నారు.

చెడుకు వ్యతిరేకంగా అమెరికన్లు ఏకం కావాలని ఆయన కోరారు."అనూహ్యమైన వాటిని జరగకుండా నిరోధించింది దేవుడు మాత్రమే" అని కూడా చెప్పారు.

"""/" / అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుడి చెవి పైభాగానికి గాయం అయింది.

ఈ దాడి చేసిన వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ కాల్చి చంపారు.US సీక్రెట్ సర్వీస్( United States Secret Service ) ప్రకారం, శనివారం బట్లర్‌లోని ర్యాలీ వేదిక వెలుపల ఒక ఎత్తైన స్థానం నుంచి దాడి చేశారు.

వామ్మో.. ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి ఆస్తుల విలువ తెలిస్తే మాత్రం అవాక్కవ్వాల్సిందే!