సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లా( Sangareddy District ) గడ్డపోతారం పారిశ్రామికవాడలో( Gaddapotharam Industrial Estate ) అగ్నిప్రమాదం జరిగింది.

హెటిరో పరిశ్రమలో( Hetero Company ) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ నుంచి దట్టమైన పొగలు వెలువడుతున్నాయి.

కాగా పరిశ్రమలోని ఈటీపీ సెక్షన్ లో సాల్వెంట్ రికవరీ చేస్తుండగా మంటలు చెలరేగాయని తెలుస్తోంది.

వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

అయితే గడిచిన వారం రోజుల్లో పరిశ్రమలో రెండోసారి ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది.

దట్టమైన పొగ, మంటలు రావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

నయనతారతో గొడవలు నిజమే.. విభేదాలపై ఓపెన్ అయిన త్రిష!