Kattedan Fire Accident : రాజేంద్రనగర్ కాటేదాన్ లో అగ్నిప్రమాదం.. అదుపులోకి రాని మంటలు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని కాటేదాన్( Rajendra Nagar Kattedan ) లో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు.

తెల్లవారుజాము నుంచి బిస్కెట్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.బిల్డింగ్ మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు మూడో అంతస్తుకు చేరుకున్నాయి.

దీంతో మంటల ధాటికి భవనం పడిపోయే స్థితికి వచ్చిందని తెలుస్తోంది.మంటలు భారీగా( Fire Accident ) ఎగిసిపడుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్న కంపెనీల సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

కాగా ఐదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

మరోమారు కొంప ముంచిన గూగుల్‌ మ్యాప్స్‌.. లోయలోకి దూసుకెళ్లిన భారీ కంటైనర్..