జగిత్యాల జిల్లా బైపాస్ రోడ్డులో అగ్నిప్రమాదం.. రూ. లక్షల్లో ఆస్తినష్టం
TeluguStop.com
జగిత్యాల జిల్లాలోని( Jagityala District ) బైపాస్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం( Fire Accident ) జరిగింది.
బైక్ మెకానిక్ షెడ్ లో( Bike Mechanic Shed ) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దాదాపు 20 నిమిషాల పాటు మంటలు భారీగా చెలరేగినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో షెడ్ లోని 20 బైకులు అగ్నికి ఆహుతి అయ్యాయి.
దీంతో సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లింది.
అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.