Nilofar Hospital : హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
TeluguStop.com
హైదరాబాద్ లోని నీలోఫర్ ఆస్పత్రిలో( Nilofar Hospital ) అగ్నిప్రమాదం సంభవించింది.
ఆస్పత్రి భవనంలోని మొదటి అంతస్తులోని ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని తెలుస్తోంది.
మంటలతో పాటు దట్టమైన పొగ భారీగా అలుముకుందని తెలుస్తోంది.ఆస్పత్రి పరిసరాలు అన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి.
దీంతో ఆస్పత్రిలోని పేషెంట్లతో పాటు వారి బంధువులు సైతం తీవ్ర భయాందోళనకు గురయ్యారని సమాచారం.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.