కెమికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం ఐదుగురు మృతి..!!

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీ( SB Organics Industry )లో అగ్ని ప్రమాదం జరిగింది.

రియాక్టర్ పేలటంతో మంటలు చెలరేగాయి.ఈ ఘటనలో ఐదుగురు కార్మికులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి.

హత్నూర మండలం చందాపూర్ శివారులో ఈ ఘటన జరిగింది.క్షతగాత్రులను సంగారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.

ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.ఇదే సమయంలో హైదరాబాద్ ఫిలిం ఛాంబర్( Hyderabad Film Chamber ) లో కూడా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

స్వరూచి హోటల్ కిచెన్ లో మంటలు చెలరేగాయి.భారీగా మంటలు ఎగసిపడుతూ ఉండటంతో.

చుట్టుప్రక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. """/"/ ఫిలిం ఛాంబర్ భవనం నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతూ ఉండటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలతో అలుముకున్నాయి.

దీంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టడం జరిగింది.ఫిలిం ఛాంబర్ మెయిన్ రోడ్డుపై ఉండటంతో పొగతో వాహనాదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మరోపక్క అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.ఈ అగ్ని ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్( Short Circuit ) కారణంగా జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాద సంఘటనలు సంచలనంగా మారాయి.సంగారెడ్డి ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఫ్యాక్టరీ డైరెక్టర్ సైతం మరణించినట్లు సమాచారం.

వీల్ చైర్ లో నటి రష్మిక మందన్న…షాక్ లో అభిమానులు!