ఆదిభట్ట ఓఆర్ఆర్ పై కారులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
TeluguStop.com
హైదరాబాద్ లోని ఆదిభట్ల సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది.ఓఆర్ఆర్ పై ఆగి ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యారు.మృతుడు కోదాడకు చెందిన వెంకటేశ్ గా పోలీసులు అనుమానిస్తున్నారు.
వాహనదారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆగి ఉన్న సమయంలో కారుకు ఎవరైనా నిప్పు పెట్టారా? లేక ప్రమాదవశాత్తు ప్రమాదం చోటు చేసుకుందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.