ప్రజలు అత్యంత సంతోషంగా జీవించే దేశం ఎదో తెలుసా..?!

ఏ దేశం చూసినా కరువు కాటకాలు, అంతర్యుద్ధాలు, పరాయి దేశాల దండయాత్రలు, ఆర్థిక సంక్షోభాలు, మార్కెట్‌లలో ఒడిదుడుకులు ఇలా ఎన్నో కారణాలతో ఇబ్బంది పడుతుంటాయి.

వ్యక్తిగతంగా చూసినా ప్రజలు మరిన్ని ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు.కొందరికి డబ్బు, ఆస్తి, హోదా అన్నీ ఉన్నా వెలితిగా ఉంటారు.

అయితే ఓ దేశంలోని ప్రజలు నిత్యం సంతోషంగా ఉంటారని ఓ నివేదికలో వెల్లడైంది.

దానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.h3 Class=subheader-styleవరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2022 ఇలా.

/h3p ఆరోగ్యం, వ్యక్తిగత స్వేచ్ఛ, అవినీతిపై అవగాహన, ప్రజల్లో ఔదార్యం, సంతృప్తికర జీవనం ఇలా ఎన్నో అంశాల ఆధారంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్‌ ను తయారు చేస్తారు.

ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ సర్వే నిర్వహించి అత్యుత్తమ దేశాల జాబితాను వెలువరిస్తారు.2022కు సంబంధించి మార్చి 18న ఈ నివేదిక విడుదలైంది.

అందులో ఫిన్‌లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంలో వరుసగా ఐదోసారి నిలిచింది.ఆ తర్వాత స్థానం డెన్మార్క్ పొందింది.

ఈ సంవత్సరం 146 దేశాలకు ర్యాంక్ వచ్చింది.గతేడాది టాప్ 10లో నిలిచిన దేశాల ర్యాంకులు తారుమారయ్యాయి.

గతేడాది టాప్ 10లో ఉన్న ఆస్ట్రియా ప్రస్తుతం ర్యాంకు పరంగా కిందికి దిగజారింది.

"""/"/ H3 Class=subheader-styleటాప్ 10లో ఉన్న దేశాలివే./h3p వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీల జాబితాలో తొలి స్థానంలో ఫిన్లాండ్, డెన్మార్క్ రెండవ, ఐస్ ల్యాండ్ మూడవ స్థానంలో నిలిచాయి.

ఆ తరువాత వరుసగా స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, లక్సెంబర్గ్, స్వీడన్, నార్వే, ఇజ్రాయెల్, న్యూజిలాండ్ ఉన్నాయి.

ఇక ఈ జాబితాలో భారత్‌కు 136వ ర్యాంకు దక్కింది.మన కంటే మన పొరుగు దేశాలైన పాకిస్తాన్(121), శ్రీలంక(127)లకు మెరుగైన ర్యాంకు లభించింది.

ఇక ఈ జాబితాలో అట్టడుగు నుంచి తొలిస్థానాన్ని ఆఫ్గనిస్తాన్ పొందింది.అత్యంత అసంతృప్తికరమైన దేశంగా అది నిలిచింది.

దాని తర్వాత స్థానాల్లో లెబనాన్, జింబాబ్వే ఉన్నాయి.

రొటీన్ సినిమాలతో కమర్షియల్ హిట్స్ కొట్టే టాలీవుడ్ డైరెక్టర్లు వీళ్లే..??