నిజమా.. ఆ చెట్టు దగ్గరికి వెళ్తే.. సందర్శకులకు జరిమానా..?!

రోజూ కొద్ది సేపు ప్రకృతిలో గడపడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.అందుకే చాలా మంది అడవి అందాలను చూసేందుకు ఇష్టపడతారు.

అయితే కాలిఫోర్నియాలోని రెడ్ వుడ్ నేషనల్ పార్క్ లో మాత్రం సందర్శకులు చెట్ల దగ్గరికి వెళ్తే జరిమానా విధిస్తారు.

సందర్శకుల తాకిడి వల్ల చెట్టుకు హాని కలుగుతుందని పార్క్ మేనేజ్మెంట్ ఇలా చేస్తుంది.

ప్రపంచంలోనే ఎత్తయిన చెట్లకు నిలయంగా ఈ రెడ్ వుడ్ నేషనల్ పార్క్ ఉంది.

ఈ పార్కులో 115.92 మీటర్ల పొడవైన ‘హైపెరియస్’ ఉంది.

ఇక్కడి ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఇవి చాలా ఎత్తుకు పెరుగుతాయి.ఒక్కో హైపెరియస్ చెట్టు 600 నుంచి 800 ఏళ్ల వరకు జీవిస్తుందని అంచనా.

ఈ పార్క్ లోని హైపెరియస్ చెట్టు 2006లో ‘వరల్డ్స్ టాలెస్ట్ ట్రీ’గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో స్థానం కూడా దక్కించుకుంది.

దీంతో ఈ చెట్టును చూసేందుకు చాలా మంది ఇక్కడికి వస్తారు.బ్లాగర్లు, ట్రావెల్ రైటర్స్, వెబ్ సైట్ల కారణంగా ఈ చెట్టు సందర్శనకు పెద్ద సంఖ్యలో పర్యటకులు తరలివస్తున్నారు.

ఈ చెట్ల వేర్లు భూ ఉపరితలానికి దగ్గరగా పెరుగుతాయి.దీంతో పాటు వయసురీత్యా అవి చాలా సున్నితంగా ఉంటాయి.

సందర్శకుల తాకిడి పెరగడంతో చెట్టుకు హాని కలుగుతుందని రెడ్ వుడ్ పార్క్ లో ‘హెపెరిస్’ చెట్టు గల ప్రాంతాన్ని మూసివేశారు.

"""/"/ అయిన సందర్శకులు మాత్రం దానిని చూసేందుకు ఎగబడుతున్నారు.ఈ చెట్ల వేర్లు కూడా కాలినడకన వెళ్లే సందర్శకుల వల్ల దెబ్బతింటున్నాయి.

పైగా అక్కడికి వెళ్లే ప్రాంతంలో మానవ వ్యర్థాలు సహా చెత్తను కూడా గుర్తించినట్లు అక్కడి ఉద్యోగులు చెబుతున్నారు.

దీంతో ప్రపంచ రికార్డు కలిగిన ఈ చెట్టును చూడటాన్ని అధికారులు పరిమితం చేశారు.

పార్కు అదేశాలను ఎవరైనా అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటారు.ఆ చెట్టు సమీపంలోకి వెళ్లిన వారికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు 5 వేల డాలర్లు జరిమానా విధించే అవకాశం ఉంది.

టెనెంట్ సినిమా రివ్యూ అండ్ రేటింగ్!