యువత సమస్యల పై ప్రభుత్వానికి పట్టింపు లేదని విమర్శించిన రాహుల్!

నెక్స్ట్ ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ గాంధీ ఈమధ్య వరుసగా బిజేపి ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తూ బిజేపి సర్కార్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.

నిన్నటికి నిన్న కుదేలవుతున్న ఆర్ధిక వ్యవస్థను సరిచేయడానికి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేసిన ఈయన.

తాజాగా దేశంలో పేదరికం నిరుద్యోగం పెరిగిపోయాయని వాటిని నిర్మూలించడానికి మోడీ సర్కార్ ఎటువంటి ముందస్తు వ్యూహరచన చేయలేదని ఆయన ప్రభుత్వంపై మండిపడ్డారు.

పోటీ పరీక్షల కోసం అందరి నుండి ఫీజ్ లు వసూలు చేసిన ప్రభుత్వం వాటిని ఇంకా నిర్వహించలేదని,నిర్వహించిన వాటి ఫలితాలను నెలలు గడుస్తున్నా విడుదల చేయకుండా యువత భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆయన ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచి వెంటనే పెండింగ్‌లో ఉన్న పరీక్షా ఫలితాలను ప్రకటించి వారికి ఉద్యోగాలు కల్పించడం పై దృష్టి సారించాలని ఆయన ప్రభుత్వాన్ని సూచించారు.

దీనిపై స్పందిచిన బిజేపి నాయకులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, తీసుకొచ్చిన పథకాలు ప్రజల ఆకలిని తీర్చలేదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో వాటిని సరిచేయడానికి అలాగే బోర్డర్ లో బుసలు కొడుతున్న రెండు శత్రుదేశాలను కంట్రోల్ చేయడానికి ఒకపక్క ప్రయత్నిస్తూ మరోపక్క ఆర్థిక సంక్షోభాన్ని కంట్రోల్ చేయడం కోసం నిపుణుల సలహాలను ప్రస్తుతం వింటుందని త్వరలోనే ఒక పక్కా ప్రణాళికతో ఆర్థిక సంక్షోభాన్ని భారత్ జయిస్తుందని బిజేపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.

అప్పులు చేసి చదువు.. ఒక్క మార్కుతో ఫెయిల్.. జోయా మీర్జా సక్సెస్ స్టోరీకి హ్యాట్సాఫ్ అనాల్సిందే!