ఫైనాన్షియల్ టిప్స్: పేరెంట్స్‌పై పెళ్లి ఖర్చుల భారాన్ని తగ్గించండిలా..!

పెళ్లి చేయడమంటే మాములు విషయం కాదు.జీవితాంతం కూడబెట్టిన సొమ్మంతా ఒక్క పెళ్లి రోజే ఖర్చయిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు.

అయితే గతంలో పెళ్లిళ్ల భారమంతా తల్లిదండ్రులపైనే పడేది కానీ ఇప్పుడా భారాన్ని మోసే స్థాయికి చేరుకుంటున్నారు యువత.

ఉన్నత చదువులు చదవి పెద్ద కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడగలుగుతున్నారు నేటి యువత.

ఈ తరుణంలో యువతీయువకులు తమ పెళ్లిళ్ల కోసం స్వయంగా డబ్బు సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

చక్కటి జీతాలు అందించే ఉద్యోగాల్లో చేరగానే మ్యారేజ్ కోసం కొంతమొత్తాల్లో డబ్బు పొదువు చేయడం మంచిదని సలహా ఇస్తున్నారు.

సాధారణంగా పెళ్లిళ్ల కోసం వార్షిక ఆదాయానికి 1.5 లేదా 2 రెట్ల మొత్తాన్ని ఖర్చు చేయవచ్చు.

అంతకుమించిన ఖర్చు అనవసరం.అయితే ఒక ఏడాది ఆదాయానికి 2 రెట్ల నగదును పోగు చేయాలంటే ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం తప్పనిసరి.

ముఖ్యంగా మీ ప్రతినెలా బడ్జెట్ ను నిర్ధేశించాలి.సామర్ధ్యానికి మించిన ఖర్చులు చేయకూడదు.

చాలా డబ్బు సమకూర్చుకోవాలి అంటే నష్టభయం లేని పెట్టుబడులు పెట్టాలి.అయితే పెళ్లి కావడానికి పట్టే సమయం ఆధారంగా స్వల్ప లేదా దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలి.

అన్ని ఖర్చులు పోను మిగిలినవి పెళ్లి, మీ పేరెంట్స్ పదవీ విరమణ కోసం సేవ్ చేయండి.

పెళ్లి నిర్వహణ తరువాత విహార యాత్రలకు అయ్యే ఖర్చులు మీ తల్లిదండ్రులపై పడకుండా ఉండేలా జాగ్రత్త పడడమూ ముఖ్యమే.

వీటన్నిటి కంటే ముందు అప్పటికే ఉన్న అప్పులను తీర్చాలి.తద్వారా తల్లిదండ్రులపై ఎలాంటి భారం పడదు.

"""/"/ పెళ్లయిన తర్వాత బాధ్యతలతో పాటు ఖర్చులన్నీ పెరిగిపోతుంటాయి.అందుకే బీమా, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చాలా మంచిది.

పెళ్లయిన తర్వాత కొత్త ఇంట్లో కొత్తగా ఫ్యామిలీ ఏర్పాటు చేయాల్సి వస్తే.గృహ వస్తువులన్నీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

అందుకే వీటి కోసం కూడా సరిపడా నగదును పొదుపు చేయడం మంచిది.ఇలా చేయడం ద్వారా మీ తల్లిదండ్రులు మీ పెళ్లి కోసం దాచిన డబ్బులు వినియోగించకుండా.

మీ పెళ్లి ఖర్చులను స్వయంగా మీరే భరించి వారిని సంతోష పెట్టొచ్చు.

రెండు రోజుల్లో వైసీపీ మ్యానిఫెస్టో విడుదల..: వైవీ సుబ్బారెడ్డి