అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం

రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని బంటు ఆనందం గత కొద్ది నెలల నుండి అనారోగ్యంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న మల్యాల గ్రామ యువకుడు పొంచెట్టి వెంకటేష్ సన్నాఫ్ తిరుపతి శనివారం రోజున కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం 5000 రూపాయలు అందించారు.

ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఆనందం గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతూ మృతి చెందాడని తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో ఈసరి శ్రీనివాస్ సంటి ప్రసాద్ రొండి సాగర్ బంటు అంజయ్య,రొండి రాజు పాల్గొన్నారు.

బిగ్‌బాస్ చెత్త ధోరణి.. కంటెస్టెంట్లను తప్పుగా చూపిస్తున్నాడే..?