పేదింటి బిడ్డ చదువుకు ఎమ్మేల్యే రూ.లక్ష ఆర్ధిక సాయం

నల్లగొండ జిల్లా:ప్రభుత్వం కల్పించే అవకాశాలతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని,రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్య రంగాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధన్యత నిస్తుందని, విద్య ద్వారానే సమాజంలో ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవం పెరుగుతుందని,పేదరికం దేనికి అడ్డుకాదని విద్యలో ప్రతిభ కనబరిస్తే ఉన్నత స్థాయిలో రాణిస్తారన్నారని,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య రంగానికి కోట్ల రూపాయలు కేటాయించిదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు.

సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెంపటి గ్రామానికి చెందిన కొండగడుపుల మహేశ్వరి అనే నిరుపేద దళిత బిడ్డ తల్లిదండ్రులను హైదరాబాద్ కు పిలిపించి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.లక్ష్యం ఉన్నతమైతే ఏదైనా సాధిస్తారని విద్యార్థులకు హితబోధ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే పేద విద్యార్థులు విద్యలో రాణిస్తున్నారని చెప్పారు.దాతలు అందించిన ఆర్థిక సహకారంను పొందినవారు తిరిగి సమాజానికి తమ దాతృత్వంను చాటాలని కోరారు.

వివరాల్లోకి వెళితే.నిరుపేద కుటుంబానికి చెందిన కొండగడుపుల మహేశ్వరి ఐదవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యనభ్యసించింది.

డాక్టర్ కావాలనే కోరికతో మొదటి ప్రయత్నంలోనే నీట్ లో ప్రతిభ కనబరిచి కామినేని దంత వైద్య కళాశాలలో బిడిఎస్ సీటు సాధించింది.

కానీ,కాలేజీ ఫీజు కట్టలేని ఆ నిరుపేద బిడ్డకు ఆర్థిక సమస్యలు గుదిబండగా మారడంతో సీటు వదులుకోవాల్సి వచ్చింది.

అయినప్పటికీ పట్టు వదలక,చదువుపై ఉన్న మమకారం చంపుకోలేక ఎంసెట్ పరీక్ష రాయడంతో ఈ సంవత్సరం హైదరాబాదులోని ఆర్టికల్చర్ కళాశాలలో సీటు వచ్చింది.

అయినా కాలేజీలో హాస్టల్ ఫీజు, సెమిస్టర్ ఫీజుల రూపంలో ఆర్థిక సమస్యలు ఎదురవడంతో పాటు తండ్రి పెరాలసిస్ బాధితుడు కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేద విద్యార్థిని పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ మండల నాయకురాలు దాయం ఝాన్సీ రాజిరెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మేల్యే మహేశ్వరి చదువు అండగా నిలిచారు.

ఆ విద్యార్థి విద్యాభ్యాసానికి అండగా ఉంటానని భరోసనిచ్చారు.తన విద్యకు సహకారం అందించిన ఎమ్మెల్యేకు మహేశ్వరితో పాటు ఆమె తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్‌ .. అమెరికాను వీడనున్న సెలబ్రెటీలు , ఎవరెవరంటే?