మైనారిటీలకు లక్ష రూపాయల ఆర్ధిక సహాయం… హర్షం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ అజయ్
TeluguStop.com
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పని చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
బడుగు, బలహీన వర్గాల వారికి అందజేస్తున్న విధంగానే అర్హులైన మైనార్టీ వర్గాల వారికి పూర్తి సబ్సిడీతో లక్ష రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయెడం పట్ల రాష్ట్ర మైనారిటీల తరుపున రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు దివ్యంగులకు సైతం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచుతూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన దరిమిల నేడు మైనార్టీ వర్గానికి అండగా నిలిచారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పేదరికం నిర్ములనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని కులాలను మతాలను గౌరవిస్తూ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సమానంగా సంక్షేమాన్ని అందిస్తున్నారని, మైనారిటీ వర్గాల వారి కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
విశ్వంభర సినిమా చిరంజీవి కంటే కూడా వశిష్టకు చాలా కీలకమా..?