ఎట్టకేలకు కలుకోవ మత్స్య సహకార సంఘం ఎన్నికలు

సూర్యాపేట జిల్లా:కోదాడ నియోజకవర్గ పరిధిలోని మునగాల మండలం కలకోవ మత్స్య సహకార సంఘం ఎన్నికలు గత మూడు పర్యాయాలుగా వాయిదా పడుతూ వస్తుండగా, తాజాగా హైకోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు మంగళవారం భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

గ్రామంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.

పోలీస్ ప్రహర మధ్య ఉదయం ఎనిమిది గంటలకే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది.

మొత్తం 42 మంది సభ్యులున్న సహకార సంఘంలో ఇద్దరు సభ్యులు మరణించగా 40 మంది సభ్యులు ఎన్నికలకు హాజరు కావాల్సి ఉండగా 33 మంది సభ్యులు హాజరయ్యారు.

కలకోవ మత్స్య సహకార సంఘం నందు 9 డైరెక్టర్ పదవులకు గాను ఎన్నికలకు హాజరైన సభ్యుల్లో 9 మంది నామినేషన్లు వేయగా పోటీ లేకపోవడంతో 9 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవమయ్యాయి.

అనంతరం ఎన్నికల నియమావళి ప్రకారం నూతనంగా ఎన్నికైన 9 మంది డైరెక్టర్లు నూతన అధ్యక్షుడిగా అనంత గురవయ్యను, ఉపాధ్యక్షుడిగా పాతకోట్ల లింగయ్యను,కార్యదర్శిగా బుర్రి బాబుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మత్స్య సహకార సంఘం నందు డైరెక్టర్ మరియు అధ్యక్ష, ఉపాధ్యక్ష,కార్యదర్శి పదవులకు పోటీ నామినేషన్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎన్నికల నియమావళి ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు ఎన్నికల అధికారి డి.

నాగేశ్వరరావు ప్రకటించారు.ఎన్నికల సందర్భంగా కోదాడ డిఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, సిఐ ఆంజనేయులు,ఎస్సై లోకేష్ ఆధ్వర్యంలో ఐదుగురు సిఐలు, పలువురు ఎస్సైలు,120 మంది ప్రత్యేక పోలీస్ సిబ్బంది ప్రహార మధ్య గ్రామంలో 144 సెక్షన్ విధించి ఎన్నికలని సజావుగా నిర్వహించారు.

ఎన్నో రోజులుగా వివాదంలో ఉన్న కలకోవ మత్స్య సహకార సంఘం చెరువు ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం చేసిన ప్రత్యేక కృషి ఫలించింది.

దృశ్యంలో మీనా పాత్రను ఆ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేసిందా.. అసలేం జరిగిందంటే?