ప్రభాస్ తో బాలయ్య చిట్ చాట్ ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్ ఇదే!

నందమూరి బాలకృష్ణ ఇప్పుడు సినిమాలతో పాటు టాక్ షోకు హోస్ట్ గా కూడా చేస్తున్న విషయం తెలిసిందే.

బాలకృష్ణ మొట్టమొదటి సారిగా హోస్ట్ గా చేసిన షో 'అన్ స్టాపబుల్'.సినీ సెలెబ్రిటీలు పాల్గొంటున్న ఈ షో సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

ఇక సీజన్ 1 ఘన విజయం సాధించడంతో సీజన్ 2 కూడా స్టార్ట్ చేసేసారు మేకర్స్.

ఇప్పటికే ఐదు ఎపిసోడ్స్ కూడా స్ట్రీమింగ్ అయ్యి ప్రేక్షకులను అలరించాయి.ఇక ఇప్పుడు ఈ సీజన్ 6వ ఎపిసోడ్ కోసం కూడా రెడీ అవుతుంది.

సీజన్ 2 అన్ని ఎపిసోడ్స్ కూడా పర్వాలేదు అనిపించినా బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎపిసోడ్ మాత్రం లేదు.

దీంతో ఈసారి అదిరిపోయే రేంజ్ లో నెక్స్ట్ ఎపిసోడ్ ను ప్లాన్ చేస్తున్నారు.

మన టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోగా దూసుకు పోతున్న స్టార్ ప్రభాస్.

ఈయనను ఈ షోకు తీసుకు రాబోతున్నారు.ఒకపక్క డార్లింగ్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ బాలయ్య షో కోసం రాబోతున్నాడు.

గత కొన్ని రోజుల నుండి ఈ షోకు ప్రభాస్ రాబోతున్నాడు అనే రూమర్స్ వస్తున్నాయి.

కానీ ఇప్పుడు అది కన్ఫర్మ్ అయ్యింది.ఈ స్పెషల్ ఎపిసోడ్ షూట్ గురించి తాజాగా అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ ఎపిసోడ్ షూట్ డిసెంబర్ 11న జరగనుందట. """/"/ డిసెంబర్ 11న ఈ షూట్ జరగబోతుండడంతో ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదికపై ముచ్చటించ నున్నారు.

బాలయ్య ప్రభాస్ ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడో అని ఆయన ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ముఖ్యంగా ఈయన పెళ్లి గురించి అయితే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది.ఇక ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు ఆయన స్నేహితుడు గోపీచంద్ కూడా కనిపించ బోతున్నాడు అనే రూమర్స్ వస్తున్నాయి.

చూడాలి ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో.

పార్లర్ గ్లో ఇంట్లోనే పొందాలనుకుంటే ఈ రెమెడీని అస్సలు మిస్ అవ్వకండి!