అందరికీ అన్ని నచ్చాలని లేదుగా… ట్రోల్స్ పై రష్మిక కామెంట్స్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandana ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

అయితే ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడు రణబీర్ కపూర్( Ranbir Kapoor )తో కలిసి ఈమె నటించిన యానిమల్ ( Animal ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మధ్య సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ సినిమాలో ఈమె గీతాంజలి పాత్రలో నటించారు.అయితే ఈ సినిమాలో రష్మిక పాత్రకు పెద్ద ఎత్తున ప్రశంసలు రాగ మరికొందరు విమర్శలు కూడా చేశారు.

ముఖ్యంగా ఈ సినిమాలోని కర్వాచౌత్ సన్నివేషంలో రష్మికపై భారీ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి.

"""/"/ ఈ పండుగ సందర్భంగా వచ్చే సన్నివేశాలలో రష్మిక డైలాగ్స్( Rashmika Dialogues ) సరిగా చెప్పలేదు అంటూ ఈమె గురించి ఎంతోమంది ట్రోల్స్ చేశారు.

అయితే ఈ ట్రోల్స్( Trolls ) గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మిక స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.యానిమల్ సినిమాలో కొన్ని సన్నివేశాలలో నా డైలాగ్స్ బాలేవని నా ముఖం అలాగే హావభావాలు కూడా సరిగా లేవని చాలామంది విమర్శలు చేశారు.

"""/"/ ఇలా విమర్శలు చేసినటువంటి సన్నివేశాలలో కార్వా చౌత్ సన్నివేశం( Karva Chauth Scene ) ఒకటని తెలిపారు.

నిజానికి ఈ సీన్స్ సినిమాకి చాలా హైలెట్ గా మారిందని రష్మిక తెలిపారు.

నటిగా తాను ఒక సన్నివేశం చేయాలి అంటే ఎన్నో హావభావాలను పలికించాల్సి ఉంటుంది అలా చేయడం కోసం నేను ఎంత కష్టపడతానో నాకు మాత్రమే తెలుసు.

ఇక ఎలాంటి సన్నివేశాలలో ఏ విధంగా నటించాలో నాకు తెలుసని ఈమె తెలిపారు.

అయినా ఎవరి అభిరుచులు వారివి అన్నీ అందరికీ నచ్చాలని రూలేమీ లేదు కదా అంటూ ఈ సందర్భంగా తన గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పట్ల రష్మిక స్పందిస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి సినిమాను ఆ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న శ్రీకాంత్ ఓదెల…మరి ఇది వర్కౌట్ అవుతుందా..?