లవ్ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్న యాంకర్ రష్మి… బయటపడిన అసలు విషయం!

జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్( Rashmi Gautham ) గురించి తెలియని వారంటూ ఉండదు.

రష్మి జబర్దస్త్( Jabardasth ) యాంకర్ గా మాత్రమే కాకుండా సుధీర్ ప్రేయసిగా కూడా బాగా పాపులర్ అయింది.

జబర్దస్త్ వేదిక మీద సుధీర్ , రష్మీ జంటకి ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే.

షో రేటింగ్స్ కోసం సుధీర్ రష్మీ ఇద్దరు కూడా ప్రేమికులుగా నటించారు.అయితే వీరి మధ్య కెమిస్ట్రీ చూస్తే మీరు నిజంగానే ప్రేమించుకుంటున్నారు అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి.

ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ కి దూరంగా ఉంటున్నాడు.అయినప్పటికీ రష్మి సుధీర్ ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

ఇదిలా ఉండగా సుధీర్ కి షాక్ ఇచ్చేలా రష్మి తన ప్రేమ విషయం బయట పెట్టింది.

"""/" / తాజాగా ' శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company )` ఎపిసోడ్‌ ప్రసారం అయింది.

ఈ షో లో వ్యక్తిగత జీవితంలో తాను ప్రేమలో ఉన్నట్టు రష్మి వెళ్లడించింది.

కెరీర్‌ లైఫ్‌ సాఫీగానే సాగుతుందని, కానీ పర్సనల్‌ లైఫ్‌ లో తన లవ్‌ సక్సెస్‌ అవుతుందా? లేదా? అనేది టెస్ట్ చేసుకుంది.

అందులో భాగంగా ఆర్య సినిమాలో లాగా ఓ పాప్ కార్న్ బాక్స్ లో రాళ్లు వేస్తుంటారు.

అలా రష్మి తన ప్రేమనే టెస్ట్ చేసుకుంది.ఆమె టెన్షన్‌ పడుతూనే రాయి వేయగా లక్కీగా అది ఆ డబ్బాలో పడింది.

దీంతో ఒక్కసారిగా రష్మి తన లవ్‌ సక్సెస్‌ అవుతుందనే ఆనందంలో చిందులేసింది. """/" / `రష్మీ నీ లవ్‌ సక్సెస్‌` అని చెప్పగా, నా పొలంలో మొలకలొచ్చాయ్‌ అంటూ ఆమె రెచ్చిపోయి మాస్ స్టెప్పులు వేసింది.

ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సంబంధించిన ఈ ఎపిసోడ్ యూట్యూబ్లో వైరల్ గా మారింది.

అయితే నిజంగానే రష్మి ఎవరైనా ప్రేమిస్తున్నారా లేకపోతే కేవలం ఎప్పటిలాగే షో రేటింగ్స్ పెంచడానికి ఇలా ఎవరినో ప్రేమిస్తున్నట్లు చెప్పిందా? అనే అనుమానాలు ప్రేక్షకులలో కలుగుతున్నాయి.

అంతేకాకుండా ఈ షోలో రష్మి తాను ప్రేమించిన వ్యక్తికి సంబంధించిన విషయాల గురించి వెల్లడించలేదు.

అందువల్ల ఇదంతా కేవలం షో రేటింగ్స్ కోసం మాత్రమే చేశారని ప్రేక్షకులు మండిపడుతున్నారు.

వీడియో: పనిమనిషి సోఫాలో కూర్చుందంటూ ఎన్నారై మహిళ ఫిర్యాదు.. ఆమెపై నెటిజన్లు ఫైర్!