పెళ్లి చేసుకున్న ఇమ్మాన్యుయేల్ వర్ష.. రోజా ఏమన్నారంటే..?

రవి లాస్య, సుధీర్ రష్మీ జోడీల తరువాత బుల్లితెరపై ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న జోడీ ఎవరైనా ఉన్నారా అంటే ఇమ్మాన్యుయేల్ వర్ష జోడీ అని చెప్పాలి.

ఈ జోడీకి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.తాజాగా ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో వర్ష ఇమ్మాన్యుయేల్ పెళ్లికొడుకు పెళ్లికూతురు గెటప్స్ లో కనిపించారు.

రోజా ఇమ్మాన్యుయేల్ ను చూసి నిన్ను చూస్తే నాకో జోక్ గుర్తొస్తుందని అంటారు.

ఇమ్మాన్యుయేల్ ఏం జోక్ అని అడగగా ఎండలో కాకికి నీళ్లు పెడితే మంచి పెళ్లాం వస్తుందని నువ్వు లస్సీ పెట్టినట్టు ఉన్నావ్ అందుకే నీకు సూపర్ పెళ్లాం వచ్చిందని రోజా చెబుతారు.

ఆ తరువాత సుధీర్ రష్మీతో ఎనిమిదేళ్ల నుంచి ఆన్ స్క్రీన్ జోడీ అంటావని నిన్న కాక మొన్న వచ్చిన జోడీ అప్పుడే డిపోకు వెళ్లిందంటూ సుధీర్ వర్ష ఇమ్మాన్యుయేల్ జోడీని చూపిస్తాడు.

తాను మాత్రం ఇంకా తిరుగుతూనే ఉన్నానని సుధీర్ రష్మీతో చెబుతాడు. """/"/ సుధీర్ అలా అనడంతో రష్మీ నువ్వు ఎన్నిరోజులు రోడ్డు మీద తిరుగుతుంటావో అన్ని రోజులు బస్సు కూడా రోడ్డుపైనే ఉంటుందని రష్మీ అంటారు.

సుధీర్ వెంటనే బస్ డిపోకు వెళ్లే ఛాన్స్ లేదా.? అని అడగగా నువ్వు డిపోకు వచ్చే ఛాన్స్ ఉందా.

? అని రష్మీ అంటారు.సుధీర్ పెళ్లి గురించి ప్రశ్నించగా సుధీర్ కు అంత సీన్ లేదనేలా రష్మీ పరోక్షంగా సెటైర్ వేశారు.

వర్ష ఇమ్మాన్యుయేల్ చేసిన ఈ స్కిట్ ప్రోమోకు హైలెట్ అయింది.వచ్చే శుక్రవారం రాత్రి 9.

30 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.జబర్దస్త్, ఢీ షోలతో పాటు ఇతర షోల నిర్వాహకులు రీల్ జోడీల లవ్ ట్రాక్ లతో ప్రోగ్రామ్ లను ప్రసారం చేస్తుండటం గమనార్హం.

సైబర్ అలర్ట్: అకౌంట్లో డబ్బులు పడ్డాయని మెసేజ్ వచ్చిందా.. జాగ్రత్త సుమీ..