సమంత తండ్రి మరణించినా ఆమెను ఓదార్చని సెలబ్రిటీలు.. ఇది మరీ దారుణం!
TeluguStop.com
మాములుగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు అందరూ కలిసిమెలిసి ఉండాలి అని సినిమా పరిశ్రమ అనేది ఒక కుటుంబం లాంటిదని, సందర్భాలు వచ్చినప్పుడు చాలా మంది సెలబ్రిటీలు వేదికలపై చెబుతూ ఉంటారు.
ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా అలాంటి సందర్భాలలో అండగా నిలవాలని చెబుతుంటారు.అయితే ప్రతి ఒక్కరు చెప్పిన వాటిని పాటించేది కేవలం కొంతమంది మాత్రమే.
అలాగే అతి కొద్ది సందర్భాలలో మాత్రమే ఈ విధంగా స్పందిస్తూ ఉంటారు.కానీ తాజాగా సినిమా ఇండస్ట్రీలో జరిగిన ఒక విషాద ఘటన పై చాలా మంది సెలబ్రిటీలు స్పందించకపోవడం అన్నది చాలా దారుణం అని చెప్పాలి.
టాలీవుడ్ హీరోయిన్ సమంత(Tollywood Heroine Samantha) తండ్రి జోసెఫ్ ప్రభు శుక్రవారం కన్ను మూసిన సంగతి మనందరికీ తెలిసిందే.
ఆ విషయాన్ని ఎంతో బాధగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది సామ్. """/" /
ఆమె ఎంత వేదన అనుభవిస్తోంది అనే విషయం ఆమె పెట్టిన పోస్ట్, ఎమోజీ చూస్తే అర్థమవుతుంది.
ఆమె ఈ పోస్ట్ పెట్టిన వెంటనే అభిమానులు, నెటిజన్లు వెంటనే స్పందించి ఆమెకు తమ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెబుతున్నారు.
కానీ సెలబ్రిటీలు మాత్రం ఈ విషయం పట్ల ఎవరు స్పందించకపోవడం అన్నది ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
సమంత</em(Samantha) ఇంటికి నాగచైతన్య(Naga Chaitanya) వెళ్లి పరామర్శిస్తాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
కానీ, అలా జరగలేదు.కనీసం అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక్క పోస్ట్ కూడా సోషల్ మీడియాలో కనిపించలేదు.
పోనీ నాగచైతన్య ప్రస్తుతం పెళ్లి వేడుకలలో ఉన్నారు అక్కడికి వెళ్ళకూడదు అనుకుంటే, కనీసం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయినా చేయవచ్చు.
అలా కూడా చేయలేదు. """/" /
ఇక చైతన్య సంగతి పక్కన పెడితే.
సమంతతో సినిమాలు చేసిన హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్(NTR, Ram Charan, Mahesh Babu, Allu Arjun) వంటి వారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క పోస్ట్ పెట్టలేదు.
అంతేకాదు తోటి హీరోయిన్లు కూడా సమంతకు సానుభూతి తెలుపుతూ మెసేజ్‌లు పెట్టలేదు.తన ఫ్రెండ్స్ అని చెప్పుకునే చిన్మయి, నందినీ రెడ్డి వంటి వారు కూడా ఎలాంటి పోస్టులు పెట్టలేదు.
దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది.సమంతను ఇండస్ట్రీ నుంచి వెలివేశారా అందుకే ఆమెను సానుభూతిని తెలియజేయలేకపోతున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నో సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్న వారి ఇంట్లో విషాదం నెలకొంటే స్పందించడం, సానుభూతి తెలియజేయడం కనీస ధర్మం కాదా అని అడుగుతున్నారు.
మరీ ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు.ఆరోగ్యం బాగోలేక మరోవైపు మాజీ భర్త పెళ్లి జరుగుతూ బోలెడు దుఃఖంలో ఉన్న సమంతకు ఇలా తండ్రి చనిపోవడం అన్నది నిజంగా చాలా బాధాకరం అని చెప్పాలి.
ఇలాంటి సమయంలో సెలబ్రిటీలు ఎవరు స్పందించకపోవడం ఇంకా బాధాకరమని చెప్పాలి.అయితే ఇలాంటి సందర్భాలలో అభిమానులు సమంతకు అండగా నిలుస్తున్నారు.
ఇండస్ట్రీ నుంచి కేవలం ముగ్గురు హీరోలు మాత్రమే స్పందించారు.సుధీర్‌బాబు, నితిన్, తేజ సజ్జా.
సమంతకు(Sudheer Babu, Nithin, Teja Sajja.Samantha) సానుభూతి తెలియజేస్తూ పోస్టులు పెట్టారు.
వింటర్ లో జలుబు వదలట్లేదా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!