మాజీ ఎంపీ ఉండవల్లిపై సినీ నటుడు విమర్శలు..!
TeluguStop.com
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పై సినీ నటుడు శివాజీ తీవ్ర విమర్శలు చేశారు.
టీడీపీ హయాంలో మద్యం అమ్మకాలు, ధరలపై మండిపడ్డ ఉండవల్లి, వైసీపీ ప్రభుత్వంలో మద్యం ధరలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.
అనంతరం ఆయన సీఎం జగన్ కు భజన చేస్తున్నారని మండిపడ్డారు.వైసీపీ పాలనలో ఏపీ అప్పుల రాష్ట్రంగా మారిందని ఆరోపించారు.
ప్రజలు పోరాటాలకు సిద్ధంగా ఉన్నప్పుడే నాయకులు అవినీతి లేకుండా పరిపాలిస్తారని తెలిపారు.అనంతరం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ ఐఏఎస్ అధికారులను కాకుండా నేతలను, కార్యకర్తలను నమ్ముకోవాలని హితవు పలికారు.వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చకుండా సర్కార్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.
రామ్ చరణ్ సుకుమార్ సినిమా ఏ కథతో తెరకెక్కబోతుంది…