మహేష్ బాబు ఒక పెద్ద రాక్షసుడు… ఫైట్ మాస్టర్స్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మహేష్ బాబు ( Mahesh Babu ) సినిమాలపరంగా ఎంత డెడికేషన్ చూపిస్తారో మనకు తెలిసిందే.

ఏదైనా ఒక సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమాకు వంద శాతం న్యాయం చేయడానికి ఈయన ఆసక్తి చూపిస్తారు.

ఇలా మహేష్ బాబు ఒక యాక్షన్స్ సీన్ అయినా రొమాంటిక్ సన్నివేశమైన కూడా ఆ సీన్ లో మంచి క్వాలిటీ కంటెంట్ వచ్చేవరకు టేక్స్ తీసుకుంటూనే ఉంటారట.

అయితే ఇదే విషయాన్ని ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ (Ram Laxman ) బ్రదర్ కూడా వారి వేలో మహేష్ బాబు ఒక సినిమా రాక్షసుడు అంటూ తెలియచేశారు.

"""/"/ సినిమాల కోసం ఈయన ఒక రాక్షసుడు లాగా పని చేస్తారని సినిమాలంటే ఆయనకు అంత పిచ్చి అనే ఉద్దేశంతో ఫైట్ మాస్టర్ మహేష్ బాబు గురించి ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు.

అయితే వీరు మహేష్ బాబుని వారి భాషలో పొగడడం ఇక్కడ అభిమానులకు తప్పుగా అనిపించింది దీంతో మహేష్ బాబు అభిమానులు( Mahesh Babu Fans ) ఫైట్ మాస్టర్స్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

మా సూపర్ స్టార్ ని ఇలా రాక్షసుడు అంటారా అంటూ కొందరు ఈ ఫైట్ మాస్టర్లను ట్రోల్ చేస్తున్నారు.

"""/"/ ఇక్కడ మహేష్ బాబు సినిమాల పట్ల చూపించే డెడికేషన్ గురించి వారు మాట్లాడినప్పటికీ అభిమానులు మాత్రం తప్పుగా అర్థం చేసుకోవడంతో ఈ ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే ఈయన ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas ) దర్శకత్వంలో వస్తున్నటువంటి గుంటూరు కారం ( Gunturu Kaaram ) సినిమాలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు బిజీ కాబోతున్నారు.

ఇక గుంటూరు కారం సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగకు విడుదల కాబోతుందని తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

ట్రంప్ ర్యాలీలో మరోసారి భద్రతా లోపం.. స్టేజ్‌పైకి దూసుకొచ్చిన అగంతకుడు