స్టార్ హీరో ప్రభాస్ అలా చేయడంతో గూస్ బంప్స్ వచ్చాయి.. ఫైట్ మాస్టర్ కామెంట్స్ వైరల్!

కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD Movie ) మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.

ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు ఒకింత ఎక్కువగానే ఉన్నాయి.ఈ సినిమాకు ఫైట్ మాస్టర్ గా పని చేసిన సతీష్ పోలోజు( Satish Poloju ) ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కల్కి సినిమాలో ప్రభాస్ చక్రం ఆపే సీన్ అంటే నాకు ఎంతో ఇష్టమని ఆయన తెలిపారు.

నిజానికి ఆ చక్రం బరువు చాలా ఎక్కువని ఆయన వెల్లడించారు.షూటింగ్ సమయంలో ప్రభాస్ గారు( Prabhas ) నిజంగా ఆ చక్రాన్ని ఆపడం సంతోషాన్ని కలిగించిందని సతీష్ వెల్లడించారు.

సినిమాలో దీపికా పదుకొనేని( Deepika Padukone ) తాళ్లతో కట్టి లాక్కొని వెళ్లే సన్నివేశం ఉంటుందని ఆ సన్నివేశంలో దీపిక అద్భుతంగా చేశారని ఆయన వెల్లడించారు.

సతీష్ చేసిన కామెంట్లు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. """/" / కల్కి 2898 ఏడీ హిట్ అవుతుందని విడుదలకు ముందే చాలామంది భావించారు కానీ ఈ స్థాయిలో సంచలనం సృష్టిస్తుందని ఎవరూ ఫీల్ కాలేదు.

కల్కి సినిమాలో ఫైట్ సీన్స్( Kalki Fight Scenes ) అన్నీ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

దిశా పటానీ పాత్రకు కల్కి సీక్వెల్ లో అయినా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

"""/" / కల్కి 2898 ఏడీ 2024 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని అభిమానులు ఫిక్స్ అవుతుండటం గమనార్హం.

కల్కి సీక్వెల్ యాక్షన్ ప్రియులకు సైతం నచ్చేలా ఉండనుందని తెలుస్తోంది.ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రభాస్ పారితోషికం సైతం పెరుగుతోందని భోగట్టా.

కల్కి 2898 ఏడీ మూవీ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

కల్కి క్రేజ్ మామూలుగా లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై20, శనివారం2024